తిరుప్పావై -ఆరవ పాశురం;- వరలక్ష్మి యనమండ్ర
మాలే! మణివణ్ణా! మార్గళి నీరాడువాన్; మేలైయార్ శేయ్యనగళ్ ; వేణ్ణువన కేట్టియేల్;

ఇ- లతై యెల్లామ్ నడుజ్ఞ మురల్వన పాలన్న శజ్ఞజ్ఞ్గళ్, పోయ్ ప్పాడు డైయనవే, శాలప్పేరుమ్ పఖైయే, పల్లాణ్ణిశైప్పారే, కోలవిళక్కె, కోడియే, వితానమే, ఆలినిలై యామ్! ఆరుళేలో రెమ్బావాయ్
***********
ఆరవ పాశురము యొక్క భావము పంచపది ప్రక్తియలో

ఆశ్రిత వరదుడవు ఆపన్న హస్తుడవు
ఇంద్రనీలం వంటి దేహమ్ము కలవాడవు
లోకములనన్నిటిని బొజ్జలో దాచావు
ఒక మర్రి ఆకుపై నీవు పవళించినావు
వటపత్ర నాయీ! మాకు వరమీయవా!.. లక్ష్మీ

పాంచజన్యమంటి శంఖములును
పాలవలె తెల్లని శంఖములును
పెద్దవైనా పర వాయిద్యములును
మధురముగ పాడు భాగవతులు
వటపత్ర శాయీ! మాకు వరమీయవా!. లక్ష్మీ

మంగళ కరమైన దీపములవసరము
వ్రాత సంకేతాలు, చాందినీలవసరము
కాకుండ చూడవలె వ్రత భంగము
నీ మంగళాశాసనము మాకవసరము
వటపత్ర శాయీ!మాకు వరమీయవా! . లక్ష్మీ
***********


కామెంట్‌లు