గీతాజయంతి! అచ్యుతుని రాజ్యశ్రీ

 భగవద్గీత పుణ్య ప్రదాత
జాతి మత కులాలకు అతీతం
అందరికీ శక్తి ప్రేరణ అఖండ గీతామృతం
కృష్ణుని నోట ప్రవహించే
పార్థునికి ఉత్సాహం ఉల్లాసం ఇచ్చే
"లే లే! నీధర్మం కర్తవ్యం చేస్తూ పోవోయ్! చీకుచింతలు వదిలేయ్" మాటల్తో 
నీరసం గ్లాని విషాదం ఆమడదూరం
కురుక్షేత్రం లో గలగలపారే గంగ
జలజల ఉప్పొంగే తరంగాలు
గీతాపఠనం దానధర్మాలు
ముక్తికి సోపానం
అంతర్జాతీయ హోదాలో గీతాజయంతి మోక్షదా ఏకాదశి
మత్స్య ద్వాదశి
మన హృదయం కురుక్షేత్రం
సకారాత్మకంగా పయనిద్దాం
జయజయ గీతా భగవద్గీత
నమోస్తుతే! పావనచరితా🌷
కామెంట్‌లు