ఇష్టపడి చదివితేనే ఉజ్వల భవిష్యత్తు

 పాఠశాల పిల్లలు వివిధ పాఠ్యాంశాలను ఇష్టపడి చదివితేనే వారికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని శ్రీరాంపూర్ ఎంఈఓ ఆరెపల్లి రాజయ్య, ఎఫ్ఎల్ఎన్ మండల నోడల్ అధికారి సిరిమల్ల మహేష్ అన్నారు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ కు చెందిన గంగిశెట్టి జగదీశ్వర్ అనే విశ్రాంత గణిత ఉపాధ్యాయుడు తన తల్లి గంగిశెట్టి మధురమ్మ జ్ఞాపకార్థం గురువారం కాల్వశ్రీరాంపూర్ మండలంలోని ఐదు ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న 215 మంది బాలబాలికలకు పరీక్ష అట్టలను అందించారు. పెగడపల్లి హైస్కూల్లో 30, శ్రీరాంపూర్ హైస్కూల్లో 30, కూనారం హైస్కూల్లో 30, కేజీబీవీ లో 40, మల్యాల ఆదర్శ పాఠశాలలో 85 మంది పిల్లలకు పరీక్షా అట్టలను గంగిశెట్టి జగదీశ్వర్  అందజేశారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఎంఈఓ ఆరెపల్లి రాజయ్య, ఎంఎన్ఓ సిరిమల్ల మహేష్ లు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో సకల సౌకర్యాలతో పాటు అనుభవజ్ఞులైన అధ్యాపకులతో శాస్త్రీయ విద్యా విధానంలో బోధన  చేయిస్తున్నామన్నారు. ఎఫ్ఎల్ఎన్ బృహత్తర కార్యక్రమాల ద్వారా ప్రభుత్వ పాఠశాల పిల్లల్లో కనీస అభ్యసన స్థాయిలను పెంపొందిస్తున్నట్లు వారు తెలిపారు. అలాగే దాతల సహకారంతో పాఠశాలల్లో వివిధ రకాల విద్యాసామాగ్రిని అందిస్తున్నామన్నారు. వేలాది రూపాయలు వృధా చేసుకోకుండా, తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి, ఉచిత నాణ్యమైన విద్యను పొందాలని వారు కోరారు. పదవ తరగతి బాల బాలికల ప్రయోజనార్ధం పరీక్ష అట్టలను అందజేసిన గంగిశెట్టి జగదీశ్వర్ ను వివిధ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు అభినందించారు. గణిత ఉపాధ్యాయుడిగా ఉద్యోగ విరమణ చేసి, పేద పిల్లలకు ఉచితంగా ట్యూషన్ చెబుతూ వందలాదిమంది ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు విద్యాసంబంధిత సామాగ్రిని ఉచితంగా అందజేస్తున్న జగదీశ్వర్ సేవలను పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో పెగడపల్లి, శ్రీరాంపూర్, కూనారం, కేజీబీవీ, ఆదర్శ పాఠశాల, ఎస్సీ కాలనీ ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఎల్. సత్యనారాయణరావు, నరెడ్ల సునీత, ఎస్. మహేష్, ఎ. శ్రీదేవి, శ్రీనివాస్, ఈర్ల సమ్మయ్య, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు, బాలబాలికులు, పలువురు పాల్గొన్నారు.
కామెంట్‌లు