పార్లమెంటు భద్రతపై ఆందోళన.

 భారత లోక్ సభ జరుగుతున్న సమయంలో, ఇద్దరు ఆగంతకులు గేలరీ నుండి దూకిన సంఘటన దిగ్భ్రాంతి కలిగించిందని జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతల సంఘం జాతీయ అధ్యక్షులు చౌధరి రాధాకృష్ణ, ప్రధాన కార్యదర్శి కొమ్మన పురుషోత్తం, ఉపాధ్యక్షుడు డి.ఎ.స్టాలిన్, కోశాధికారి కొప్పల సూర్యనారాయణ, కార్యదర్శి పారశెల్లి రామరాజు, కార్యవర్గ సభ్యులు కుదమ తిరుమలరావులు అన్నారు.  
భద్రతా సిబ్బంది సంఘటన జరిగిన కొన్ని సెకండ్లలోనే దుండగులను అదుపులో తీసుకోవడం కొంత ఊరట కలిగించిందని వీరు పేర్కొన్నారు. 
లోక్ సభ సభ్యలెవరికీ హాని జరగకపోవడం ఆనందకరమన్నారు. భద్రతా ఏర్పాట్లు మరింత పటిష్ట పరచవలసిన ఆవశ్యకతను ఈ సంఘటన హెచ్చరిస్తుందని వారు ఈ ప్రకటనలో గుర్తు చేశారు.
కామెంట్‌లు