సర్వెంట్....! ;- కోరాడ నరసింహా రావు !
పొరపాటున మిమ్మల్ని సర్వెంట్ అనుకున్నాను
 సా రీ... అండి...! 

ఫరవాలేదులే బాబు..! 
సర్వెంట్ అనుకోవటం లో... 
 చిన్నతన మేము0ది...!? 

బిడ్డలకు , తల్లిదండ్రులు
 సర్వెంట్లు కాలేక పోతే.... 
ఆ బిడ్డ లింత గొప్ప వాలుగా
ఎలా కాగలుగుతారు...!! 

కన్న బిడ్డలకు తల్లి, దండ్రులు
 సర్వెంట్లు కావలసిందే... 
 ఇందులో చిన్న తనమూ... 
  సిగ్గుపడవల్సిన విషయమూ
 ఏమీ లేదు నాయనా...! 

కన్న బిడ్డలకు తల్లి దండ్రులు
ఆ తల్లి, దండ్రుల వృద్ధాప్య0లో
 వారికి బిడ్డలూ సర్వెంట్లు కావ లసిందే .. కాకుంటే... ఈ బ్రతుకులు సక్రమ0గా నడవవు నాయనా..! 
   అసలీ సమాజ0 నడిచేదే... 
 సర్వెంటుల వ్యవస్థల మీద..! 
భర్తకు భార్య సర్వెంట్ ..! 

 ప్రజలకు , సాధారణ ఉద్యో గులు మొదలుకొని 
కలక్టర్లు, మినిస్టర్ల వరకూ అందరూ...
 పబ్లిక్ సర్వెంట్లే ...! 
 
ఇందులో... సర్వెంట్ అంటె.. 
చిన్నతనమూ.. సిగ్గుపడవల
సిందీ ఏముంది నాయనా..!? 

ఈ సమాజంలో... ఒకరి కొకరు
సెర్వు  చేసుకో వలసిందే..! 
ఇందులో చిన్న తనమేమీలేదు
సారీ లెందుకులే నాయనా.! 
  ఈ సమాజంలో  ... ఒకరి
కింకొకరు.. ప్రతి ఒకరూ.. 
సర్వె0టులే. ..! 
   ********

కామెంట్‌లు