పద్య మాధురి ;- డి.వినాయక్ రావు , భైంసా జి.నిర్మల్
 1.ఆవె:నందనందనుండు నవనీత చోరుడు
వందనీయుడతను వాసు దేవ
మంద గోవులున్న మందిరంబతనిది
బందుడయ్యి నుండు భక్తు నింట
2.ఆవె:మంత్రముచ్చరించ మాయదు పాపంబు
మనన జేయ లేని మనసు నుండ
రంధినుండ మనసు బంధౌను మంత్రము
తంతు నదియె నెరగ మంతు జయము
3.ఆవె:ఆట నయ్యె బ్రతుకు హరుడయ్యె ప్రేక్షిగన్
పోటి పడుతు నుండ్రి భూస్ప్రశుండ్రు
చేష్ట లెన్నొ జేయు జేనొంద జనులంత
హరుని కయ్యె నదియె హర్షితంబు
4.ఆవె:ధైర్య మేగ మనిషి దైవంబుగా వచ్చు
భరణి పైన కర్త భద్ర మెంచి
దిట్టతనము కలిగి దిగులును వీడినా
కృత్యమగును జయము సత్య మిదియె

కామెంట్‌లు