విజయనగరం! అచ్యుతుని రాజ్యశ్రీ

 ఢిల్లీ సుల్తానులతో పోరాడి దక్షిణ భారతదేశంలో ఐకమత్యం సాధించిన ఏకైక సామ్రాజ్యం విజయనగరం.1336 లో హంపి రాజధానిగా హరిహర బుక్క రాయలు హిందూ ధర్మం సంస్కృతి నిలబెట్టారు.ఢిల్లీసుల్తాన్ దాడులు ఆగిపోయేలా అడ్డగించారు.విద్యారణ్యస్వామి వీరిగురువు కావడం వారి అదృష్టం.హంపి తుంగభద్ర నది కిసమీపంలో  ఉంది .హంపి పేరు వెనుక ఓకథ ఉంది.బ్రహ్మదేవుని కూతురు పంప.తపస్సుచేసి శివుని భార్య ఐంది.అందుకే ఆయన కి పంపాపతి అని పేరు.హరిహరరాయలు 1336 లోవిజయనగర చక్రవర్తి అయ్యాడు.బుక్కరాయలు యువరాజు.వారి తమ్ముళ్ళు కంపన మారప్ప ముద్దప్ప.పంచపాండవుల్లాగా ఈఐదుగురు సోదరులు కల్సిమెల్సి ఉన్నారు.వీరు సంగమవంశంవారు.క్రియాశక్తి అనేపండితుడు రాజ్యపరిపాలనలో మార్గదర్శి.
1356 లో హరిహర రాయలు చనిపోయిన తర్వాత బుక్క రాయలు రాజైనాడు.అతనితర్వాత వఈరకంపరఆయలఉ ధైర్యసాహసాలు యుక్తి శక్తి తో మహ్మదీయ సుల్తాన్లను ఎదుర్కొనిదేవాలయాల్లో ఆపివేసిన పూజపునస్కారాలు
తిరిగి జరిపేలా చూశాడు.దక్షిణాదిన రామేశ్వరం దాకా సామ్రాజ్యం విస్తరించింది.నేటి బెంగళూరు కోలార్ అతనిపాలనలో ఉండేవి. కంపన భార్య గంగాదేవి " వీరకంపరాయచరితం మధురావిజయం అనే సంస్కృత గ్రంధం ని రచించింది.నాచన సోమన హరివంశం కావ్యకర్త .ఇలా విజయనగరం ఇద్దరు సోదరులవల్ల విద్యలనగరం గా ఖ్యాతి గాంచింది 🌹
కామెంట్‌లు