తిరుప్పావై ; - వరలక్ష్మి యనమండ్ర
12.పాశురము

కనైత్తిళం కట్రెరుమై కన్రుక్కిరంగి నినైత్తుములై వళియే నిన్రుపాల్ శోర, ననైత్తిలమ్ శేరాక్కుమ్ నర్ చెల్వన్ తంగాయ్ పనిత్తెలై వీళ నిన్ వాశల్ కడైపట్టి శినత్తినాల్ తెన్నిలక్షైక్కోమానైచెట్ర మనత్తుక్కినియానై ప్పాడవుమ్ నీవాయ్ తిఱవాయ్ ఇనిత్త నెళున్దిరాయ్ ఈదెన్న పేరుఱక్కమ్ఐ నైత్తిల్లత్తారు మఱిన్దేలో రెమ్బావాయ్
***********
12 వ పాశురం- భావం-పంచపదులలో
**********
పాలు పిండుటకు ఎవరూ లేరని
పాలు తాగుటకు దూడలు లేవని
దూడల తలచుకు గోవులు పాలని
కురిపించెనుగా పాల ధారలని
మీలోగిలి అంతయు పాలేగా.. లక్ష్మీ

తలపై మంచు కురియు చుండెను
పాలతో పాదాలు తడియుచుండెను
కృష్ణ నామము మేము పాడుచును 
ఎలుగెత్తి నిన్ను పిలుచు చున్నాను
ఇంకను నిద్దుర లేవవేలనే చెలీ... లక్ష్మీ

దక్షిణాదిన యున్న లంకాపురము 
అదియేకదా  రావణ రాజ్యము 
రాముడు రావణాసుర సంహారము 
వినపడలేదా  రాముని కీర్తనము
వినపడలేదా ఆ సవ్వడి  యువతీ... లక్ష్మీ

బాలకృష్ణుడు బకుడిని చంపెను
శ్రీరాముడు రావణుని చంపెను
అందగాడు చిన్నికృష్ణుడంచును
దయగల వాడు రాముడనుచును
అందరు ఈ విషయంచెప్పుచుండిరి
.. లక్ష్మీ

కృష్ణుని కీర్తనలు పాడుచున్నారు
కృష్ణుని భజనలు చేయుచున్నారు
కృష్ణుని పాటలను పాడుచున్నారు
తెల్లవారెనని  తెలుపుచున్నారు 
బృందాన్ని లో అందరు ఉన్నారు....
 లక్ష్మీ

కలువల వంటి కన్నులున్నదానవు
భజనలు చేయగా మాతో రావు
కపట నిదురను నటించుచున్నావు
ఎంతో అందము కలిగిన దానవు
నిద్దుర లేచి మాతో రమ్ము ఓ చెలీ..
 లక్ష్మీ

ఇప్పటికైనను శయ్యను వీడుమా
అందమైన దానవు నీవేలేమ్మా
చన్నీటితో స్నానం చేయుదమా
అందరమూ కలిసి పోవుదమా 
నీ అందానికి కృష్ణుడొస్తాడనుకోకు
.. లక్ష్మీ

ఇదియేగా శుభమైన తరుణము 
చేయుదముగ స్నానపు వ్రతము 
కపట నిదురను నివిక వీడుము 
పూజకు నువ్వు బయలుదేరుదము 
తలుపు తీయుము త్వరగా ఓ చెలీ
.. లక్ష్మీ

ఈ విధముగా ఎనిమిదవ గోపికను గోదాదేవి, మిగిలిన గోపికలు విరుర లేస్తున్నారు.
***********


కామెంట్‌లు