అహం! అచ్యుతుని రాజ్యశ్రీ

 నాకంతా తెలుసు నేనే గొప్ప అనుకుంటే తప్పదు అవమానం.అహంకారంకి ప్రతినిధి దుర్యోధనుడైతే 
అగ్నిలో ఆజ్యం పోసిన వాడు కర్ణుడు.రెచ్చగొట్టి కౌరవనాశనం కి కారకుడైనాడు. పెద్దవాడు ధర్మాత్ముడు ఐనా భీష్మపితామహుని మాటల్ని త్రోసిరాజని కయ్యానికి కాలు దువ్వాడు.దానికి కారణం బాల్యం నుంచి పాండవులు ముఖ్యం గా భీముడు అర్జునుడు అంటే అసూయ అకారణ పగద్వేషం.అసలు తనకోపమే తన శత్రువు.అసూయ నిలువునా దహించే అగ్ని.మనసులో చెడు బీజంని వెంటనే తొలగించాలని కర్ణుడు దుర్యోధనుడు పాత్రల మొండి తనం చూశాక మనం తెల్సుకుని పిల్లలకి బాల్యం నుంచీ చెప్తూ ఉండాలి.క్లాస్లో బాగా చదివే పిల్లలు దగ్గర తెలుసుకుని మంచిమార్కులు తెచ్చుకోవచ్చు అని టీచర్స్ పేరెంట్స్ చెప్పాలి." వాడి దగ్గరకు వెళ్ళకు.టీచర్స్ కి పక్షపాత బుద్ధి" అని అమ్మలు 
క్లాస్ లో ఫస్ట్ బెస్ట్ విద్యార్థులపట్ల ద్వేషం నూరిపోయకూడదు తమ సామాన్య బొటాబొటి మార్కులు తెచ్చుకునే పిల్లలకి.ఇదే కక్షలు కార్పణ్యాలకి బీజంగా మారుతుంది..
అచ్యుతుని రాజ్యశ్రీ
కామెంట్‌లు