తిరుప్పావై ; -వరలక్ష్మి యనమండ్ర-అద్దంకి, బాపట్ల జిల్లా
పదవరోజు పాశురం

నోత్తు చ్చువర్ క్కమ్ పుగుగిన అమ్మనాయ్! మాత్తముమ్ తారారో వాశల్ తిఱవాదార్ నాత్తత్తుళాయ్ ముడి నారాయణన్; - నమ్మాల్ పోత్తప్పటై తరుమ్ పుణ్ణియనాల్! పణోరునాళ్ కూత్తత్తిన్ వాయ్ వీళ్ న్ద కుమ్బకరణనుమ్ తోత్తు మునక్కే పెరున్దుయిల్ తాన్ తన్దానో? ఆత్త అవస్థలుడైయాయ్! అరుఙ్గలమే! తేత్తమాయ్ వన్దు తిఱ వేలో రెమ్బావాయ్.
***********
10 వ పాశురం..భావం...పంచపదులలో
***********
నిద్దుర లెమ్మూ ఐదవ గోపికా! ఓ చెలియా!
చల్లని గాలిలో నీకొరకొస్తిమి!  ఓ చెలియా!
తలుపు ఏల తెరవకుందువు ఓ చెలియా!
ప్రత్యుత్తరమైనా ఇవ్వకుంటివే ఓ చెలియా!
మొద్దు నిదుర  వీడుము నీవు ఓ చెలియా!.. కృష్ణా

తులసి పరిమళం తెల్పుచున్నదే ఓ ఓచెలియా!
నీ చెంతనే ముకుందుడు న్నాడని ఓ చెలియా!
బదులీయకనే కృష్ణసేవలో ఉంటివా చెలియా!
కృష్ణుడు నీకడ లేడని తలచి వస్తిమి చెలియా!
నాయకత్వము వహించగా వలెను ఓ చెలియా!... కృష్ణా

కుంభకర్ణుడు ఘోరనిద్ర కోరుకొనెను
శ్రీరాముడు కుంభకర్ణు సంహరించెను 
నీకు యిచ్చెనేమోగదా  ఆ నిద్దురను
గోపికలం వచ్చాము బాపుటకు నిద్రను
తొట్రుపడక లేచిరమ్ము ఓ గోపికా.... కృష్ణా

విశిష్టమైన ఆభరణములున్నవి నీకు జవరాలా
మమ్ముల మించిన ఇష్ట సఖియవుగ జవరాలా
నీతో ఉండిన పరై వాద్యము వచ్ఛును జవరాలా
వదలక కదలక నిను పిలుచుచుంటిమే జవరాలా
నోము ఫలమును పొంధగ వస్తిమి జవరాలా... కృష్ణా
***********


కామెంట్‌లు