భారతరత్న! అచ్యుతుని రాజ్యశ్రీ

 అటలుడు అతులుడు
కృష్ణాదేవి కృష్ణ బిహారీ ముద్దు బిడ్డడు
గ్వాలియర్ లో జన్మించే
భారతీయ జనతకే సుపరిపాలన అందించే
భారతరత్న గాభాసించే
ఉత్తమ పార్లమెంటేరియన్ గా కీర్తి గడించే
బస్సులో పాకిస్థాన్ కి వెళ్లే
స్నేహ హస్తం అందించే
తోక ఝాడించిన పాకిస్థాన్ని
కార్గిల్ యుద్ధంతో మట్టి కరిపించే
రాష్ట్ర ధర్మ్ పాంచజన్య ఎడిటర్ గా ఎమర్జెన్సీ కాలంలో జైల్లో
ఎన్నో కవితాసంగ్రహాలు వెలువరించే
పదమూడు రోజులు పదమూడు నెలలు
ఆపై ఐదేళ్లు ప్రధాన మంత్రిగా
చెణుకులు విసురుతూ
సభల్లో నవ్వులు పండించే
అపరభీష్మాచార్యుడు బ్రహ్మచారి అనారోగ్యంతో
చిరయశస్సుతో అజరామరుడై
భారతీయ జనతలో 
సదా స్మరణీయుడు
మహనీయుడు🌷
కామెంట్‌లు