కవనకుసుమాలు;- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
కుసుమాలు
కబురునుపంపాయి
కబుర్లుచెప్పి
కుతూహలపరిచాయి

చక్కదనాలను
చూపించాయి
సుగంధాలను
స్రవించాయి

అలరులు
అలరించాయి
మదులను
మత్తెక్కించాయి

మందారాలు
మధువులొలికాయి
ముద్దుమాటలతో
మురిపించాయి

గులాబీలు
గుసగుసలాడాయి
గుండెలో
గుబులుపుట్టించాయి

మల్లెపూలు
విచ్చుకున్నాయి
మనసును
దోచుకున్నాయి

సన్నజాజులు
సరసాలాడాయి
సమయమును
సరదాగాగడిపించాయి

చామంతులు
ఊయలలూగాయి
వన్నెచిన్నెలను
ఒలకపోశాయి

ముద్దబంతులు
ముసిముసిలాడాయి
మోమును
మిలమిలామెరిపించాయి

పూలభామలు
పకపకానవ్వాయి
ప్రేమజల్లులు
పైనవెదజల్లాయి

సుమబాలలు
చిరునవ్వులుచిందాయి
చిత్తమందు
స్థానముసంపాదించాయి

కుసుమాలను
స్వీకరిస్తా
అక్షరసుమాలను
అందంగాకూర్చుతా

కవనాలను
చేతికిస్తా
కమ్మదనాలను
చూపించుతా

పూమాలలను
మెడలోవేస్తా
పదాలను
ప్రవహింపజేస్తా

భావకవితను
పసందుగావ్రాస్తా
పాఠకులను
పరవశపరుస్తా

కవితలను
చదవండి
కుసుమాలను
తలచండి


కామెంట్‌లు