తిరుప్పావై ; -వరలక్ష్మి యనమండ్ర-అద్దంకి, బాపట్ల జిల్లా
 16వ పాశురం 
             
***********
నాయగనాయ్ నిన్జనన్దగోపనుడైయ కోయిల్ కాప్పానే! కొడిత్తోన్జుమ్ తోరణ వాశల్ కాప్పానే! మణిక్కదవమ్ తాళ్ తిఱవాయ్, ఆయర్ శిఱుమియరో ముక్కు; అటైపటై మాయన్ మణివణ్ణన్ నెన్నలే వాయ్ నేర్ న్దాన్; తూయోమాయ్ వన్దోమ్, తుయలెళ పాడువాన్, వాయాల్ మున్న మున్నమ్ మాత్తాదే, అమ్మా! నీ, నేశ నిలైక్కదవమ్ నీక్కేలో రెమ్బావాయ్.
***********
భావం- పంచపది ప్రక్రియలో
***********
16వ పాశురము భావము
వ్రేపల్లెలో ఉండు  గోపికలమన్నారు
లోనికి పంపమని అడుగుచున్నారు 
స్వామి సేవకై మేమొచ్చితిమన్నారు
పూజ చేయుటకు వచ్చితిమన్నారు
కావలి వారిని కరుణించ మన్నారు 
.... కృష్ణా 
స్వామికి మేమేమి కీడును చేయము
అనుమతిని యిచ్చినలోనికేగుదము
కీర్తన గానము చేయుటకె వచ్చాము
గొల్లవారము మేము కృష్ణభక్తులము
తలుపు తెరువుమా ఓ తంత్ర పాలకా.. కృ‌ష్ణా
చిన్న పిల్లలం కానీ వెర్రి వారము కాదనిరి
శ్రీకృష్ణుని మీద భక్తి యున్నదని చెప్పిరి
శ్రికృష్ణుని మేలుకొలుపుటకు వచ్చితి మనిరి
శ్రీకృష్ణుడు మమ్ముల రమ్మనెను యనిరి
అసురుల కాము మేమని చెప్పుచుండిరి.. కృష్ణా
        ‌******
ఆండాళ్ గోష్ఠికి అనుమతి నిచ్చిరి
తలుపులు తెరిచి లోనికేగమనిరి
స్నాన వ్రతమునకు గోపికలెళ్ళిరి
కృష్ణుని వారు కీర్తించు చుండిరి
పరమాత్మను పొందు క్రమముగను.. కృష్ణా
దేవాలయమునకు వెళ్ళి తిన్నగా స్వామిని దర్శించరాదని పెద్దలు చెబుతారు. మొదట క్షేత్ర పాలకుని దర్శించి, పిమ్మట స్వామిని దర్శించాలను నియమమును తప్పక పాటించుచూ ఆండాళ్ దేవి బృందము క్షేత్రపాలకుని అనుమతి తీసుకుని, ఆలయము లోనికి వెళ్ళివలెనని మనకు చెప్పుచుండిరి 
తంత్ర పాలకుడు= కావలివాడు (క్షేత్రపాలకుడు)
*********


కామెంట్‌లు