స్ఫూర్తిదాయకం! అచ్యుతుని రాజ్యశ్రీ
 శీతలాదేవికి పుట్టుకతోనే రెండు చేతులు లేవు.జమ్ముకాశ్మీర్ కి చెందిన దూర్ దరాజ్ పల్లెలో పుట్టిన ఈమె 16 ఏళ్ల బాలిక.కోచ్ కులదీప్ వేదవాన్ సాయంతో ప్రత్యేక ధనుస్సు తయారు చేయటం జరిగింది.చేతుల్తో కాకుండా ఛాతీ కాలితో బాణంని విడిచి పెట్టడం.. ఆరునెలలకే ఆమె ప్రవీణురాలై విశ్వ పారా విలువిద్య క్రీడలో తొలి చేతులు లేని బాలికగా గుర్తింపు పొందింది.ప్రస్తుతం ప్రపంచంలో 6గురు చేతులు లేని విలుకాండ్రు ఉన్నారు.శీతలతల్లి మేకలు కాస్తుంది.తండ్రి పొలంపనిచేసే బీద కుటుంబం లో పుట్టిన ఈమెకు కులదీప్ కోచ్ వీడియో చూపుతూ ధైర్యం చెప్పారు.ప్రపంచంలో తొలి చేతులు లేని విలుకాడు మ్యాట్ స్టుట్జ్ మెన్ వీడియో
 చూస్తూ నేర్చుకుంది.అతనిస్కోర్ 685 శీతలది689. నిజంగా అద్భుతం కదూ?
సుప్రియా పాల్ 29 ఏళ్ల యువతి భారతీయ స్టార్టప్ ఇంకో పై ప్రభావం చూపి జోష్ టాక్స్ కి శ్రీకారం చుట్టింది.న్యూఢిల్లీలో పుట్టిన ఈమె తన 20 వ ఏటనే బిజినెస్ ఉమన్ గా సత్తా చాటింది. సంగీతం లో 13ఏళ్ళు కృషిచేసిన ఈమె స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి బిజినెస్ లీడ్ ఎక్జిక్యూటివ్ గా పట్టాపొందింది. ఆమె చార్టెడ్ ఎకౌంటెంట్ కావాలి అని అమ్మ నాన్నలు ఆశించారు.కానీ2014లో తన అభిరుచికి తగ్గట్టుగా జోష్ టాక్స్ అనే సంస్థను నెలకొల్పి యువత తమ సాధకబాధకాలు బహిరంగంగా చెప్పేలా స్ఫూర్తి నిచ్చింది.2017లో జోష్ టాక్స్ హిందీ ఇతరభాషల్లో లాంచ్ అవటం2023లో 12యూట్యూబ్ ఛానెల్స్ వెలిశాయి.అన్ని ప్లాట్ ఫాం లతో కల్సి 19 మిలియన్ల గ్రాహకులున్నారు.ఈమెకు ఎంటర్ ప్రెన్యూర్ అవార్డు ఫోర్బ్స్ ఇండియా ఉమన్ పవర్ లిస్ట్ లో చేరింది.యువతకి చేయూత ప్రేరణ ఇవ్వడం ద్వారా ఎంతోమంది తమకష్టసుఖాలు పంచుకుంటున్నారు 🌹

కామెంట్‌లు