బాలల కథలకు ఆహ్వానం

🍥తెలంగాణ సారస్వత పరిషత్తు వెలువరిస్తున్న ‘బాల సారస్వతం’ గ్రంథం కోసం కథలు పంపాలని పరిషత్తు అధ్యక్షుడు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ జుర్రు చెన్నయ్య మంగళవారం ఓ ప్రకటనలో కోరారు. బాలల మూర్తిమత్వ వికాసం, పర్యావరణ పరిరక్షణ, కుటుంబ బాంధవ్యాలు, మానవత, నైతిక విలువలు, శాస్త్రీయ దృక్పథం, మాతృభాషా సంస్కృతులపై అభిమానం తదితర అంశాలు కథా వస్తువులుగా స్వీకరించి ఒకటిన్నర పేజీకి మించకుండా టైప్‌ చేసి పంపాలని పేర్కొన్నారు. telanganasaraswathaparishath@gmail.com కు జనవరి 20లోగా కథలు ఈ-మెయిల్‌ చేయాలని సూచించారు. ఉత్తమ కథలకు బహుమతులు ఉంటాయని, ఇతర వివరాలకు 88852 45234 చరవాణి నంబరులో సంప్రదించవచ్చన్నారు.
కామెంట్‌లు