సుప్రభాత కవిత ; - బృంద
ఏ కోనలో ఉన్నా కమలానికి
తన ప్రియుని రాక ఎరుకే!
తనువంత కనులైన నిరీక్షణలో
తపమెంత చేసెనో ?

ప్రసరించు భానుడి కిరణాలు
తాకిన అవని ఆనందం కన్నా
అరవిరిసిన అరవిందముల అమాయక  అందం మిన్న..

పెదవి పలుకలేని మౌనగీతి
అవ్యక్త భావనల అనుభూతి
అంతరంగానికి మాత్రమే
సొంతమైన విలువైన ఆస్తి

మదిలో కదలాడే  ఊహలు
కనుదోయి కనే కమ్మని కలలు
ఎదకు ఎరుగని ఉత్సాహమిచ్చే
తనివి తీరని తలపులు

కాంతిధారల తడిపి
కలగ బ్రతుకును నడిపి
ఇలకు జీవము పోయు
వెలకట్ట లేని ఇనుని కరుణకు

ఆనందబాష్పముల అర్ఘ్యమిస్తూ

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు