శ్రీ విష్ణు సహస్ర నామములు(బాల పంచపది )-ఎం. వి. ఉమాదేవి
 2 ). విష్ణుః

సర్వవ్యాపకము విష్ణుతత్వము
అన్నింటను సమానవిస్తరణము
సూక్ష్మభావన మూల రహితము 
సకలవిషయముల సంపూర్ణము 
శ్రీవిష్ణు సహస్రనామాలు! ఉమా!
3)-వషట్కార

వేదమంత్ర దివ్య స్వరూపము
వషట్ క్రియకిదియగు గమ్యము
సర్వశక్తులలో నియంత్రణము
విశ్వపరిపోషకపు పాలనము
శ్రీ విష్ణు సహస్రనామాలు! ఉమా!
4)
భూత భవ్య భవత్ ప్రభూః

భూతకాలమును శాశించువాడు
వర్తమానమును నిర్మించువాడు
భవిష్యత్ కాలం నిర్ణయించువాడు
సర్వకాలాధిపతి తానైనవాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు! ఉమా!

5)భూతభృత్...

సకలభూతముల సృష్టిక్రమము
సకలక్రియలందు శాసనము
సర్వకాలాలలో నిర్మితము
ప్రళయకాలమున వినాశనము
శ్రీవిష్ణు సహస్ర నామాలు! ఉమా!

6)
భూత కృత్...

సమస్తజీవులకు పోషకుడు
సర్వకర్మలను భరించువాడు
చేతనత్వము కల్గించు విభుడు
నూతనత్వము వెలయించువాడు
శ్రీవిష్ణు సహస్రనామాలు! ఉమా!

కామెంట్‌లు