కోరాడ లలిత గీతాలు....!
  " నింగిని అడుగు, నేలను.... "
       ******
పల్లవి:-
  నింగిని అడుగు... నేలను అడుగు... నీరును, గాలిని... 
 నిప్పును అడుగు...చెట్టును అడుగు, తేనె పట్టును అడుగు
మనిషి ఎలా బ్రతకాలో చక్కగ బోధిస్తున్నవి...! 
    చక్కగ బోధిస్తున్నవి...!! 
     " నింగి ని అడుగు..... "
చరణం:-
  అవి త్యాగ నిరతినె ఛాటును ఎపుడూ... స్వార్ధ మన్నదే కాన రాదు.! .... 2
    వాటి పట్ల నిర్లక్ష్యమును క్షమించ వెపుడూ...అవి సహించ లేవు...!! 
  తమ విశ్వ రూపము చూపిం చునవి...! తగిన బుద్దిని చెప్పి తీరును ...!! 
 తగిన బుద్దిని చెప్పే తీరును
      " నింగి ని అడుగు...... "
చరణం:-
  వివేకులైన,ఓ మనుషుల్లారా..! 
  ఎన్ని విన్నా... ఎంత చూసినా
  మీ అవివేకమును వీడరేలనో
  స్వార్ధమును విడనాడ లేరు కొందరు..., 
  అణగి - మనిగిఆత్మవంచనతొ
 కుక్కల్లా,బ్రతికేవారింకొందరు.!!
 మీలో మనుషుల్లా బ్రతికే వారు ఎందరు...!? 
   మనుష్యులమై పుట్టినందుకు
మన0 మనుషుల్లానేబ్రతకాలి2
  మన0 మనుషుల్లానే ఛావాలి
     " నింగిని అడుగు... నేల... "
   ********

కామెంట్‌లు