* రాజా ధి రాజు....! *-కోరాడ నరసింహా రావు
ధర్మం దారి తప్పి నపుడు
  అవతరించుయుగపురుషులు
 త్రే తా యుగమున రాముడు
  ద్వా పర మున శ్రీ కృష్ణుడు
  కలియుగమున అవతరించె
  బుద్దుడు..మహమ్మద్, క్రీస్తు ! 
  ముళ్ల కిరీటము పెట్టి కొరడా లతో కొట్టి., 
 శీలువ వేసి హింసించినా.... 
 వీరేమి చేయుచున్నారోవీరెరు గరు.. వీరి పాపమును క్షమింపు మనిన సహన శీలి ఏసు..! 

బాధ నెంత అనుభవించినా... 
 పరులను నిందింపక... 
 తండ్రి,నాచేయి యేలవిడిచితి వని... 
   విలపించెను క్రీస్తు...! 
 హక్కులను ప్రస్ని0చ... 
 తీవ్ర వాదిగా నెంచి... 
 రాజ ద్రోహి యనుచు... 
 హింసించిన జనమే... రాజులకేరాజురాజాధిరాజుయని... 
  కీర్తి0చెను క్రీస్తును...!! 
    *******

కామెంట్‌లు