జాతీయ గణితదినోత్సవం(బాలపంచపది-ఎం. వి. ఉమాదేవి
భారతమేధావి ఆవిష్కరణ
గణితరంగంలోనూ నిరూపణ
పరిశోధనలోసాగే వివరణ
జాతికోసమే మనో వితరణ
శ్రీనివాస రామానూజన్ ఉమా!

క్లిష్టమైనవి ఆ విశ్లేషణలు
ప్రభావశీలమైనరచనలు
అనంతశ్రేణి నిరంతరభిన్నాలు
సంఖ్యసిద్ధాంత గేమ్ థియరీలు
గణితపునర్నిర్మాణం ఉమా!

భుక్తికొరకు పోర్టు ఉద్యోగాలు
మంజూరయినవి ఫెలోషిప్పులు
హార్ది, వాకర్లా ఆహ్వానములు
కేం బ్రిడ్జిలో మహా గౌరవాలు
కలిసి చేసిరి ప్రాజెక్టులు ఉమా!

ప్యూర్ మాత్సనీ నంబరు థియరీలు
మాక్ తీటా మ్యాజిక్ స్క్వే రులు
నేటికీ సాగే పరిశోధనలు
జన్మదినమున తపాల బిళ్ళలు
జాతీయగణిత దినోత్సవం ఉమా!!

కామెంట్‌లు