తిరుప్పావై;- కొప్పరపు తాయారు

  ‌🌻8వ, పాశురము🌻
===============
  కీళ్. వానమ్  వెళ్ళె న్రు  ఎరుమై  శిరవీడు  మేయ్
  వాన్  పరన్దనకాణ్  మిక్కుళ్ళ పిళ్ళైగళుమ్
  పోవాన్  పోగినా  పోగామల్ కాత్తున్నై కూపువాన్ 
   వన్దు  నిన్రోమ్  కోదుకలముడైయ  పోవాయ్ !
  ఎళున్దిరాయ్  పాడిపరైకొణ్డు మావోయ్  !
  పిళాన్దనై  మల్లరై  మాట్టియ  దేవాదిదేవనై 
  చెన్రునామ్ శేవిత్తాల్  ఆవావెన్రారాయ్ 
    న్త్దరుళేలో  రెమ్బావాయ్
  
     తూర్పు దిక్కంతయు ఆకాశము తెల్లవారింది గేదెలు మంచు మేత మేయుటకు విడువబడినాయి.
అవి స్వేచ్ఛగా తిరుగుతున్నాయి తోటి గోపికలందరూ శ్రీకృష్ణుడు చేరకముందుగనే అతని వద్దకు చేరాలని, అట్లు చేసిన అతడు చాలా సంతోషించునని తలుస్తున్నారు. అందరూ కలిసి గోష్టిగా పోవుటే మంచి దని యెంచి  వారినందరినీ అచ్చట నిలిపి నీ కొరకు వచ్చితిమి. నీకును అతనిని చేరుటకు కుతూహలముగనే ఉన్నది కదా ! మరి ఇంకా ఆలస్యం ఎందుకు లెమ్ము! అశ్వాసుర రూపమైన కేశిని, చాణూర ముష్టికాదులను చీల్చి చెండాడిన శ్రీకృష్ణుని సన్నిధికి పోయి మన నోమునకు కావలసిన 'ప' అనే సాధనమును పొందుదము. అతని రాకకు
ముందే మనమటకు పోయిన అతడు అయ్యో! మీరు
నా కంటే ముందుగనే వచ్చితిరే ! అని నొచ్చుకొని మన అభీష్టములను వెంటనే నెరవేర్చును.
                        ***🪷**🪷**
కామెంట్‌లు