సుప్రభాత కవిత ; - బృంద
నింగి నుండి  నీటికి
పొంగిన ప్రేమ సందేశం
ఏటి మనసే దినరాజుకి
కోటలాటి మందిరం

గగనాన సాగే కరిమబ్బుల
సాగక ఆగి చూచు సంబరం
కిరణాల మెరుపులన్ని
ఆభరణమై మెరయు అద్భుతం

వేచి చూస్తున్న ప్రకృతి 
భక్తి భావానికి మెచ్చి
వెలుగు జిలుగుల శాలువా కప్పి
సన్మానించిన సూర్యుడు.

భువనపు మైమరపు చూసి
పసిపాపల కేరింతల్లా
నవ్వుల కరతాళధ్వనులు
కురిపించు కుసుమసందోహం

తరగని దూరాలు
తనివి తీరని అనురాగాలు
తలపులందు ఏకమై
తనియించు మమతలు

జీవబలం ప్రసాదిస్తూ
చైతన్యస్రవంతిగా మారుస్తూ
అవని అణువణువునకూ
అంతులేని అనుగ్రహం పంచుతూ

అనవసరంగా సంతోషించమనీ
అందరికీ ప్రేమని పంచమనీ
అనుక్షణం జీవించమనీ
అందిన జన్మను సార్థకం చేసుకోమనీ

అవిరళంగా అభిమానం
పంచుతున్న అంతర్యామికి

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు