వోని పాఠశాలను సందర్శించిన డిప్యూటీ డిఇఓ

 వోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలను పాలకొండ డివిజన్ ఉప విద్యాశాఖాధికారి పర్రి కృష్ణమూర్తి సందర్శించారు. 
పాఠశాల పనితీరు పట్ల ఆయన తన సంతృప్తిని వ్యక్తం చేశారు. ఒకటో తరగతి నుండి ఐదో తరగతి వరకూ వర్క్ బుక్స్ ను, 
ఆరవ, ఏడవ, ఎనిమిదవ తరగతుల నోట్ బుక్స్ ను తనిఖీ చేసి, తగు సూచనలు గైకొన్నారు. వంటగదిని పరిశీలించి ఈరోజు వంటకు సరిపడు సామాగ్రి, సరిపడేలా ఉన్నాయని, రుచికరంగా  ఉన్నాయని అన్నారు. పాఠశాల ఆవరణ మిక్కిలి పరిశుభ్రంగా ఉందని ఆయన ప్రశంసించారు. అనంతరం ప్రధానోపాధ్యాయని బి.నాగమణి, ఉపాధ్యాయులు పి.శారదాకుమారి, జి.సూర్యనారాయణ, డి.పుష్పలత, ఎస్.వెంకటరమణ, కె.తిరుమలరావులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి శనివారం సాయంత్రం ఉపాధ్యాయులను సమావేశపరిచి ఆ వారంలో నిర్వహించిన పాఠశాల కార్యకలాపాలపై చర్చిస్తూ ఉండాలని ప్రధానోపాధ్యాయని బలగ నాగమణికి సూచించారు. నూతన పదాలను నల్లబల్లపై వ్రాసి విద్యార్థులచే వ్రాయించి, చదివించి వాటి గూర్చి అవగాహన పరుచుట ద్వారా చదువుల స్థాయిని పెంపొందించవచ్చునని కృష్ణమూర్తి సూచించారు. ఉపాధ్యాయులంతా పాఠాలపై ఎప్పటికప్పుడు క్విజ్, ఉక్తలేఖనం, పఠనం, వంటి ప్రతిభాపరీక్షలు నిర్వహించినచో, సిలబస్ పై మరింత పట్టు సాధించవచ్చునని అన్నారు. ఆంగ్లభాషా బోధన, టోఫెల్, లెర్న్ ఎ వర్డ్ ఎ డే అమలగుచున్న తీరును సమీక్షించారు.  
పాఠశాలరికార్డులను తనిఖీచేసి తగువివరాలను నమోదు చేసుకున్నారు. ప్రధానోపాధ్యాయని బలగ నాగమణి, ఉపాధ్యాయులు పాలవలస శారదకుమారి, గోగుల సూర్యనారాయణ, దానేటి పుష్పలత, సిద్ధాబత్తుల వెంకటరమణ, కుదమ తిరుమలరావు పాల్గొన్నారు.
కామెంట్‌లు