తాత తెచ్చిన కానుకలు(బాల గేయం)- ఎడ్ల లక్ష్మి
వచ్చాడయ్యా వచ్చాడు
కనకయ్య తాత వచ్చాడు
కానుకలు కొన్ని తెచ్చాడు
వెనుకకు దాచి పెట్టాడు

పిల్లలందరినీ పిలిచాడు
మెల్లెగ కథలు చెప్పాడు
కథలో నీతిని అడిగాడు
పిల్లలు యోచన చేశారు

పిల్లలు అంతా కలిసారు
పక్కకు వెళ్లి నిలిచారు
కథలో భావం విప్పారు
తాత వద్దకు వచ్చారు

కథలో నీతిని తెలిపారు
పిల్లల మాటలు విన్నాడు
దాసిన కానుకలు తీశాడు
ప్రీతితో పిల్లలకు ఇచ్చాడు


కామెంట్‌లు