తిరుప్పావై ; కొప్పరపు తాయారు
 🌻10వ,పాశురము🌻



  వర్కమ్   పుహిగినవమ్మనాయ్  నోట్రుచ్చు
  మాట్రముమ్.  తారారో వాశల్  తిరవాదాల్ 
  నాట్రత్తుళాయ్ ముడి నారాయణన్ నమ్మాల్
  పోటప్పరైత్తరుమ్ పుణ్ణియ‌నాల్ పజ్జూరునాళ్
  కూట్రత్తిన్  వాయ్ విళన్ద  కుమ్బకరుణనుమ్
   తోటు మునక్కే పెరున్దుయిల్ తాన్  తాన్దానో ?
   ఆటవనన్దుడైయా  యరుంగలమే
   తేట్రమాయ్ వన్దు. తిరవేలో  రెమ్బావాయ్ 

నోము నోచి శ్రీకృష్ణ సంశ్లేష  సుఖానుభవమును
పొందుచున్న ఓయమ్మా ! తలుపును తెరువుము,   తలుపును. తెరవకపోయినను మానె గాని, నోటినైను
తెరచి పలుక వచ్చును కదా తల్లీ! (జ్ఞానుల దర్శనము కంటే వారి వారి శ్రీ సూక్తులను వినటమే చాలా ముఖ్యమని చెప్పుచున్నది ఆండాళ్ తల్లి) పరిమళాలను వెదజల్లు తులసి మాలలను కిరీటముగా ధరించిన శ్రీమన్నారాయణడు మనచే స్తోత్రము చేయబడిన వాడై సంతసించి మనకు వ్రతోపకరణాలను(,పలై) ఇచ్చును కదా!
         పూర్వం ఒకనాడు ధర్మస్వరూపుడైనా పరమాత్మ రామావతారుడై అవతరించి కుంభకర్ణుని సహకరించాడు. ఆ కుంభకర్ణుడు తన పెను నిద్రను
నీ కేమైనా కానుకగా ఇచ్చెనా ఏమి? ఓ పెద్ద నిద్ర కలదానా! లేచి రమ్ము నీవు మాకు శిరోభూషణమైన దానివి కదా! తొట్రుపడక లేచి వచ్చి మా గోస్ట్ లో చేరి మా వ్రతాన్ని పూర్తి చేయాలి, కనుక నీ యోగ నిద్రను వీడి లేచి రావమ్మా! అని ఐదవ గోపికను మేల్కొల్పుచున్నారు!!! 
                 🪷***🌻**🌻***🪷

కామెంట్‌లు