తిరుప్పావై;- కొప్పరపు తాయారు
    🌻16వ,పాశురం 🌻
నాయగనాయ్. నిన్ర నన్ద గోపనడైయ. కోయిల్ కొప్పానే !కొడిత్తోన్రుమ్ వాశవ కాప్పానే  ! మణి క్కదవమ్ తాళ్ తిరువాయ్ ఆయర్  శిరు మియరో 
ముక్కు అరై పరై మాయన్ 
మణి వణ్ణన్  నె న్నె లేవాయ్ నేర్ న్దాఆన్ 
తోయ్ మాయ్  వన్దోయ్ తు యి లెళ ప్పాడు  వాన్ 
వాయాల్  మున్న మున్నమ్ మాత్తా దే అమ్మ ,!
నీ నే శని లైక్కదవమ్  నీక్కేలో  రెమ్బావాయ్
మా కందరికును ప్రభుడైన నందగోపుని యొక్క తిరు మాళిగను రక్షించు వాడా! మమ్ములోనికీ పోనిమ్ము స్వామి ని దర్శింప వచ్చాము పరిశుద్ధులమై  వచ్చాము. మణులతో కూడిన గడియను తెరువుము. మేము స్వామికి శరణాగతి చేసిన  వారము. గొల్ల కులమైన పుట్టిన అజ్ఞానులమైన నూ
స్వామి యందత్యధిక ప్రేమానురాగము కలవారము స్వామికి సుప్రభాతము పాడి మేలుకొలుప వచ్చినాము. గొల్ల వంశంలో పుట్టిన మాకు ఆశ్చర్య గుణ చేపితుడును.
     ఇంద్ర మణి వర్ణము గల శరీరము కలవాడును అగు శ్రీకృష్ణుడు మాకు "ప" అను ధ్వనించెడు వాద్యము నిత్తునని నిన్ననే వాగ్దానం చేసి నాడు. ఇప్పుడనన్య ప్రయోజనులమై స్వామి నిద్ర లేచినట్లుగా సుప్రభాతమును పాడగా వచ్చాము స్వామి! నీ నోటితో వద్దని చెప్పకుము. మమ్ములను అడ్డుకొనక దృఢముగా బంధించిన తలుపు గడియను వెంటనే తెరచి లోనికి పోనీయమని కావలి వానిని వేడుకుంటున్నారు
🌻***🌻***🌻

కామెంట్‌లు