ఉత్తమ గుణాలు-సి.హెచ్.ప్రతాప్
 పరనారీ సోదరుడై
పరధనముల కాసపడక పరులకు హితుడై
పరుల దనుబొగడ నెగడక
పరులలిగిన నలుగనతడు పరముడు సుమతీ!

పరస్త్రీలపట్ల సోదరుడిలా మెలగాలి. ఇతరుల ధనానికి ఎంతమాత్రం ఆశపడకూడదు. తోటివారంతా తనను ఇష్టపడేలా ప్రవర్తించాలి.అవసరం అనుకుంటే కొన్ని సందర్భాలలో అన్నీ వడ్డించిన అరిటాకు వలే అణిగి మణిగి వుండాలి. ఎదుటివారు పొగుడుతుంటే ఉప్పొంగిపోకూడదు. ఎవరైనా కోపగించుకొన్నప్పుడు తాను కూడా అదే పంథాలో ఆగ్రహాన్ని ప్రదర్శించరాదు. ఇలాంటి ఉత్తమగుణాలను కలిగివున్నవాడే శ్రేష్ఠుడుగా గుర్తింపబడతాడు.  ఇటువంటి వారి జీవితమే ధన్యము సుమతీ అని సుమతీ సతకకారుడు ఉత్తమ గుణాలగురించి అద్భుతంగా చెప్పాడు. శాంతికి మించిన మహా తపస్సు. సంతోషానికి మించిన శ్రేష్ఠమైన సుఖం, దయకు మించిన ఉత్తమ ధర్మం, సహనానికి మించిన ఆభరణం, ఆశకు మించిన వ్యాధి మరొకటి లేదు అన్న ఒక నానుడి కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది.
ఉదాహరణకు పితృ వాక్య పరిపాలకుడు, సకల గుణాభి రాముని 16 ఉత్తమ లక్షణాలు  ఈ క్రింది విధంగా వున్నాతి. ఇందులో ఏ ఒక్క గుణం మనం అలవరచుకోగలిగినా మన జీవితం ధన్యం అయినట్లే.
.
1.      క్రమశిక్షణ కలిగనవాడు.
2.      వీరుడు, సాహసికుడు.
3.      వేదాంతి.
4.      కృతజ్ఞుడు.
5.      సత్యవాక్కు పరిపాలకుడు.
6.      గుణవంతుడు – అన్ని గుణాల్లోను ఉత్తముడు.
7.      స్వీయ నిర్ణయాలు తీసుకోగలిగిన జ్ఞాని.
8.      సర్వ జీవుల పట్ల దయకలిగినవాడు.
9.      అన్ని శాస్త్రాల్లోనూ పండితుడు.
10.    సమస్తకార్యాలలోను సమర్ధుడు.
11.    మంచి లక్షణాలు కలిగిన అందగాడు.
12.   అత్యంత ధైర్యవంతుడు.
13.   క్రోధాన్ని జయించినవాడు. ప్రశాంత చిత్తుడు.
14.   సమస్తలోక ల్లోనూ తెలివైనవాడు.
15. అసూయ లేని వాడు.
16. దేవతలకు కూడా భయాన్ని కలిగించే ధీశాలి.

కామెంట్‌లు