వచ్చింది వత్సరం! గంగరాజు పద్మజ మలక్పేట హైదరాబాద్

 వచ్చింది కొత్త ఆంగ్ల వత్సరం
స్వాగతగీతి పాడుదాం
మనమందరం ముక్తస్వరం
సుస్నేహ పరిమళాల పన్నీరు చల్లుదాం
చలివేళ వెచ్చని శాలువా కప్పుదాం
మంచు పడిన పచ్ఛికతివాచీలో పర్చుదాం
మెత్తని పాదాల వత్తుగా
సుమాలను విసురుదాం
ఆతిధ్యమందుకొమ్మని వేడుదాం
ఆనంద గీతికలు పాడుదాం
కేకులు స్నాకులు కొసరుదాం
చిర్నవ్వుల ఛలోక్తులు విసురుదాం
వచ్చిన నచ్చిన నవవత్సరం మెచ్చింది
సందేశమిచ్చింది మనకు
కష్టసుఖాలు ఇష్టాఇష్టాలు కలబోద్దాం
గతవత్సర సంగతుల్ని నెమరేద్దాం
జూదాలు వాదాలు సారాలు నేరాలు
గీతవాద్యనృత్యాలు శాస్త్రీయంగా సల్పుదాం
సరళ విలక్షణరీతిని ఉత్సవాలు జరుపుదాం
క్రమశిక్షణ పాటించి రక్షణశాఖ ను మురిపిద్దాం
భావి పౌరులకు ఆదర్శంగా నిలుద్దాం🌹
కామెంట్‌లు