కవనం ఓకాల్కులేషన్ (రచనావ్యాసంగం);- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
రచన
ఒక గణనం
కాదంటే
అది అబద్ధం

మననం
మానసికవికారం
కవనం
ప్రణాళికాబద్ధం

ఆలోచన
పుట్టటం
కవితకు
కారణం

ఊహలు
ఉబుకటం
ఉల్లానికి
ఉత్ప్రేరకం

ఎడమమెదడు
సృజనాత్మకం
కుడిమెదడు
దృశ్యాత్మకం

వ్రాయాలి
పద్ధతిప్రకారం
తెలపాలి
తలలోనిభావం

పాఠకులను
మెప్పించటం
కావాలి
కైతలలక్ష్యం

కాగితాలను
నింపటం
బాషను
బ్రతికించటం

అక్షరాలను
అల్లటం
కానేకాదు
సులభం

పదాలను
పేర్చటం
కాదుకాదు
సరళం

పంక్తులు
విడగొట్టటం
మదులకు
ఎక్కించటం

కవితా
ప్రారంభం
లేపాలి
కుతూహలం

కవితా
సమాప్తం
తెలపాలి
ఉద్దేశం

కవితారూపము
మానసికప్రతిబింబం
కవిమానసికశ్రమకు
లభించేప్రతిఫలం

కవితలివ్వాలి
మనోవికాసం
కవులునిలవాలి
మదుల్లోకలకాలం


కామెంట్‌లు