తిరుప్పావై ; కొప్పరపు తాయారు
 🌻9వ,పాశురము.🌻   
తూమణి మాడత్తుచుట్రమ్  విళక్కెరియ
ధూపమ్  కమళ.త్తుయిలణైమేల్ కణ్  వళరుమ్
 మామాన్ మగళే మణిక్కదవమ్ తాళ్ తిరువాయ్  మామీర్ !.అవళై యెళుప్పిరో ఉన్  
మగలేదాన్  ఊమయో ? అన్రిచ్చె విడొ  ?
అనన్దలో  ఏ మప్పెరున్దుయిల్ మన్దిరప్పట్టాళో ?
 మామాయాన్  మాధవన్ వైకుంఠ న్ ఎన్రన్రు 
నామమ్ పలవుమ్ నవిన్దేలో  రెమ్బావాయ్ 
 
నిర్దోషులైనా మాణిక్యములతో నిర్మించిన భవనంలో చుట్టూ ను దీపాలు వెలుగుతుండగా అగరు ధూపములను పరిమళాలను వెదజల్చుండగా అతి మెత్తనైన హంస తూలిక కల్పముపై పరుండి  నిద్రిస్తున్న ఓ మేనమామ కూతురా! మణి మయ ప్రభలతో ప్రకాశించుచున్న నీ భవనపు గడియను తీయవమ్మా! ఏమమ్మా! మేనత్తా ! నీవేనా
ఆమెను లేపుమమ్మా! ఏమి? నీవు లేవకుండగా నీ పుత్రిక మూగదా? చెవిటిదా? లేక బద్ధకస్తురాలా?
లేక ఇంత మైమరచి నిద్రించుటకు ఏమైనది. మంత్రించి ఉంచినారా? ఆమెకేమైనది  నిద్రలేచుట
 లేదు? ఓ ఆశ్చర్య గుణ చేష్టితుడా ! ఓశ్రియఃపతీ !
ఓ పరమపదవాసీ ! అని అనేక మైన తిరునామాలను అనుసంధిస్తూన్న ఒక కన్యను లేపుచున్నారు !
***🪷*🪷** ,

కామెంట్‌లు