అష్టాక్షరీ గీతి, కవితా ప్రక్రియ.,;-శ్రీకృష్ణుని దివ్య లీలలు- - వరలక్ష్మి యనమండ్ర
 దేవకి తనయా రారా!
యశోద నందన రారా!
మురళీ లోలా గోపాలా!
జయ కృష్ణా! కృష్ణ ప్రియ!
          🪷(02)
గోవర్ధన గిరిధరా!
శకటాశుర సంహారా!
దయాశీలీ! దామోదరా!
జయ కృష్ణా! కృష్ణ ప్రియా!
         🪷(3)
ఖైదులోన జననము
ఐనను యెంత ఘనము
దివ్యము నీ చరణము
జయకృష్ణా! కృష్ణ ప్రియ!
       🪷(4)
వసుదేవుని త్యాగము
యమున యిచ్చె మార్గము
చేరె వ్రేపల్లె గ్రామము
జయకృష్ణా! కృష్ణప్రియ!
🚩కృష్ణం వందే జగద్గురుమ్

కామెంట్‌లు