కొత్త సంవత్సరం! అచ్యుతుని రాజ్యశ్రీ

 " కొత్త సంవత్సరం వస్తోంది.మీరు ఏంతీర్మానాలు చేస్తారు? ఆచరిస్తారు?" టీచర్ ప్రశ్న కి శివా అన్నాడు " టీచర్! పరిశుభ్రత కి ప్రాధాన్యత ఇస్తాను.ఓచిన్న సబ్బుముక్క తో బడిలో లంచ్ టైం లో శుభ్రంగా చేతులు కడిగి స్పూన్ తో అన్నం తిని ఇంటికెళ్ళగానే బాక్స్  సాక్స్ సబ్బునీటిలో నానేస్తాను."" మన క్లాస్ లో మనీప్లాంట్ పుదీనా చిన్న డబ్బాలో పెంచుతాను.గదిలో ఓమూల పూలగుత్తి ఆకుల్తో తెచ్చి పెడతాను." తార అంది. " మనబడి లో తోటపని మొదలుపెడతాం." ఇంకా కొందరు ఇలా అన్నారు " మేము రోజూ పేపర్ బడికి తెచ్చి ఖాళీ సమయంలో చదువుతాం.దానివల్ల భాష అక్షరాలు చదవటం రాయటం వస్తుంది.మేము త్వరగా నిద్ర లేచి గబగబా మాపనులు త్వరగా ముగించి అమ్మ నాన్నలకి సాయపడ్తాం.టి.వి.రేడియో వింటాం.డ్రాయింగ్ వేస్తాం.సంక్రాంతి వస్తోంది కదా? ముగ్గులు వేస్తాం. మాగుడిలో ఆవులు న్నాయి.వాటికి పచ్చిగడ్డి కాబేజీ కాలీఫ్లవర్ ఆకులు తినిపిస్తాం" ఇలా పిల్లల జవాబుతో టీచర్ సెభాష్ అని" జంక్ ఫుడ్ తినొద్దు " అనగానే అలాగే టీచర్.నూతనసంవత్సర శుభాకాంక్షలు హ్యాపీ న్యూ ఇయర్" అంటూ కేరింతల్తో ఇళ్ళకి బైలుదేరారు🌹
కామెంట్‌లు