సుప్రభాత కవిత ;- బృంద
పచ్చిక తిన్నెలపై వెచ్చగా
ముచ్చటలాడుతున్న
వెలుగురేఖల మిసమిసలు
నిలిచిన బిందువుపై సప్తవర్ణాలు

గగనాల నుదుటను
పగడాలు పొదిగిన పాపిటబొట్టల్లే
అందాలు చిందేటి  రవిబింబపు
కిరణాలతో దోబూచులాటలు

ఏతెంచు ప్రభువును 
ముదమార దర్శించి
పొదపొదల పత్రాల
పరవశాల ఆత్రాలు

కన్నుదోయిని నిండిన
కమనీయ దృశ్యము
దిన దినమూ వీక్షింప
నూతనమై  తోచేను

ప్రతిదినమూ ఆశావహంగా
ప్రతిక్షణమూ ఉత్సాహంగా
ప్రతికణమూ ప్రచోదనంగా
ప్రతి మనసూ  ఆనందించే

విలువైన ఉదయానికి

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు