రుక్మిణి కృష్ణమూర్తి! అచ్యుతుని రాజ్యశ్రీ

 భారతదేశంలో తొలి మహిళా ఫోరెన్సిక్ శాస్త్రవేత్త గా 72 ఏళ్ల రుక్మిణీ కీర్తి గాంచారు.నుదుట బొట్టు జుట్టు ముడి చీరకట్టు తో అమ్మ లా కన్పించే ఆమె ఎన్నో కేసుల పరిష్కారం కి మార్గం చూపారు.ఎనలిటికల్ కెమిస్ట్రీ లో పి.జి.చేసిన ఆమె పి.హెచ్.డి.చేసి మహారాష్ట్ర ఫోరెన్సిక్ లాబరేటరీ డైరెక్టర్ ఐనారు.రిటైరైనాక 2012లో సొంతం గా లాబ్ హలిక్ఎడ్వైజరీ సంస్థను నెలకొల్పారు.2002_ 2008 ప్రాంతాల్లో ముంబై నాగపూర్ పూణే మొదలైన 6ప్రాంతాల్లో ప్రపంచ స్థాయిలో ఫోరెన్సిక్ లాబ్స్ నిర్మించారు.డి.ఎన్.ఎ. సైబర్ ఫోరెన్సిక్ స్పీకర్ లాంటి టెక్నాలజీ ఉంది.హైటెక్ నేరాలకు లై డిటెక్టర్ బ్రెయిన్ సిగ్నేచర్ ప్రొఫైలింగ్ లాంటి సౌకర్యాలు ఉన్నాయి.బాంబే బ్లాస్ట్ తెలగీ స్టాంప్స్ స్కాం మొదలైన కేసుల్లో ఆమె నిర్వహించిన పాత్ర అమోఘం.110పత్రాలు సమర్పించారు.12జాతీయ అంతర్జాతీయ బహుమతులు పొందారు.టి.వి.షోలలోతప్పుగా డి.ఎన్.ఎ.టెస్ట్ క్రైం దృశ్యాలు చూపటం నిషేధించారు.రుక్మిణి జీవితం ఆధారంగా సినిమా నిర్మాణం జరగబోతోంది.🌷
కామెంట్‌లు