అద్భుత ఆలయాలు! అచ్యుతుని రాజ్యశ్రీ

 గుజరాత్ లో స్థంభేశ్వర్ శివాలయం సముద్రంలో ఉంది.వడోదరాకి 85 కి.మీ.దూరంలో ఉన్న ఈఆలయంలో శివలింగం 4అడుగుల ఎత్తు 2అడుగులవ్యాసం కల్గి ఉంది.మనం చూస్తూండగానే అది మాయమై మళ్ళీ పైకి లేస్తుంది.కేవలం ప్రొద్దున సాయంత్రం మాత్రమే దర్శనం . మహాశివరాత్రి అమావాస్య రోజున మేళా జాతరతో కిటకిట లాడ్తుంది.సముద్రపు ఒడ్డున ఉన్న ఈ ఆలయం లో అలలు ఎగసి పడగానే గుడి కన్పడదు.శివపురాణం లో దీని ప్రస్తావన ఉంది.ప్రాయశ్చిత్తంగా ఇది జరుగుతుంది అని అంటారు.
ఇంకో అద్భుతమైన ఆలయం ఖీర్ భవానీ మందిరం కాశ్మీర్ లో తుల్మూల్ అనే పల్లెకు సమీపంలో ఉంది.సరస్సు మధ్యలో ఉన్న దీని రంగు మారుతుంది అప్పుడప్పుడు.లంకాధిపతి రావణుడు ఈఅమ్మవారిని అర్చించాడు.సీతను అపహరించాడు కాబట్టి భవానీ మాతకు కోపం వచ్చింది.ఆమె హనుమాన్ తో అంది" నన్ను లంకనుంచి తీసుకుని వెళ్లి వేరే చోట ప్రతిష్ఠ చెయ్యి". అప్పుడు హనుమంతుడు విగ్రహం ని కాశ్మీర్ లో నెలకొల్పాడు.1912లో కాశ్మీర్ మహారాజు ఆలయం కట్టించాడు.మహారాజా హరిసింహ్ జీర్ణోద్ధరణ కావించాడు.కాశ్మీరీ పండితుల కులదేవత ఈమె కు జ్యేష్ఠ మాసంలో అష్టమినాడు దేవి దుర్గా ని ఖీర్ మాతగా పిలుస్తారు.వసంతకాలంలో ఖీర్ తో అభిషేకం నైవేద్యం పెడతారు.మహారగ్నా దేవి  రాగ్నాదేవి రజనీదేవి రాగ్నా భవానీ మందిరం అని పిలుస్తారు.ఈమె ఉపాసన రాగనీ రూపంలో చేస్తారు.సరస్సు మధ్య లో ఉంది గుడి.నాల్గువైపులా అందం గా రాళ్ళు పర్చబడ్డాయి.కాశ్మీర్ లో విపత్తు వస్తే సరస్సులో నీరు నల్లగా మారుతుంది.2014 లో కాశ్మీర్ వరదలు రాకముందే ఈసరసునీరు బాగా నల్లగా మారి ఆపదను సూచించింది.🌷
కామెంట్‌లు