భీష్ముని ఉపదేశాలు! అచ్యుతుని రాజ్యశ్రీ

 ద్వాపరయుగంలో అంపశయ్య పై పడుకుని భీష్ముడు ధర్మరాజుకు మంచి విషయాలు చెప్పాడు.అది శాంతి పర్వం లో ఉంది. నేటి రోడ్ రూల్స్ క్రమశిక్షణ పెద్దలని గౌరవించాలని స్వచ్ఛత శుభ్రం గూర్చి చెప్పాడు.
గోవులు పిల్లలు వృద్ధులు అధికారులు వెల్తుంటే దారి ఇవ్వాలి.వారు వెళ్లేవరకు వేచి ఉండాలి.గుడిలో ముసలివారు ఉంటే వారు దైవ దర్శనం చేసుకుని వెళ్లేలా దారి ఇవ్వాలి.పక్కకు తప్పుకోవాలి.దక్షిణదిశగా కుడివైపు అగ్నిహోత్రం కి గుడికి పెద్దలకి మర్యాద పూర్వకంగా చేసే ప్రదక్షిణ ఉత్తమం.ఈనాడు స్కూటర్ కారుపై రయ్ అని దూసుకు పోతూ యాక్సిడెంట్ చేయటం భావ్యం కాదు.ఎవరైనా క్షమించండి అని అనగానే సహృదయంతో వారి ని గౌరవించి పలకరించు అని చెప్పాడు భీష్ముడు 🌷
కామెంట్‌లు