ముక్కోటి ఏకాదశి;- - డాక్టర్ అరుణకోదాటి - హైదరాబాద్
ధనూ రాశిలో సూర్యుడు సంచరించే మాసం 
ధనుర్మాసం,
ఈమాసం లో వచ్చే శుక్ల పక్ష  ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా  ముక్కోటి ఏకాదశి  గా  వ్యవహరిస్తారు,

    ఈ ముక్కోటి ఏకాదశి నాడే హరి అనుగ్రహాన్ని పొంది,
ముక్కోటి దేవతలైన బ్రహ్మ, వరుణ, ఇంద్ర, రుద్ర, గణాలు అసురశక్తులపై విజయాన్ని సాధించారు.
  ధనుస్సoక్రమణం నుండి మకర సంక్రమణం
వరకు ఉండే " మార్గళి " మాసం మధ్య ముక్కోటి వస్తుంది.

ముక్కోటి ఏకాదశికి" మహాహరివాసరం " అని పేరు.
మురాసురుని విష్ణువు  వధిoచి,
అ  సందర్భంలో ఏకాదశి తిధిని సృజంచాడని భవిష్యో త్తర  పురాణ  కధనం,
మురుడు అజ్ఞానానికి, అవివేకానికి సంకేతం,
ఏకోణ్ముఖమైన చైతన్యం  వెళ్లి విరుస్తుంది,

ఆ ఏకోణ్ముఖమైన చైతన్యమే ఏకాదశి.

మురారి దివ్య జ్ఞానానికి ప్రతిఫలం,
జ్ఞానం వల్ల అజ్ఞానం తొలుగుతుంది.ముక్కోటి అంటే  అనేకత్వం భిన్నత్వం, భిన్నత్వం లో ఉండే సృష్టి లోని జీవరాశికి
ఏకత్వ భావాన్ని ప్రభోధించే శుభ సందర్భమే,
ముక్కోటి ఏకాదశి,

నవద్వారాలున్న ప్రతి మనిషి సర్వో త్కృస్ట మైన స్థానం శిరస్సు
శిరస్సు శరీరంలో ఉత్తర బాగానికి అగ్రభాగం
నడుము క్రింది భాగం దక్షిణ భాగం
ఉత్తర బాగానికి, శీర్ష స్థానమైన శీరస్సులో
ఉన్న మనో మందిరంలో దైవాన్ని దర్శించడమే ఉత్తర ద్వార  దర్శనం,
అంతః కరణాల్లోని ,ఉత్తమ గుణాలని నిరంతరం పరంధామునితో  మమేకం  చేయడమే, విష్ణు ఆరాధనం,

మనోవాక్కాయ, కర్మల్ని సర్వాత్మణా శ్రీ హరితో
సమ్మిళితం చేసి
విశ్వ విరాట్ వైభవాన్ని విష్ణు రూపంగా దర్శించడమే ముక్కోటి ఏకాదశి  పరమార్థం.
***       ***      ***కామెంట్‌లు