చిన్నది;- - డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 ఎంతో చిన్నదైన
ఒక దీపం
ఇస్తుంది వెలుగు అనంతం 
చిన్నదైన ఒక మొలక
పెరిగి పెద్దదై 
విశాలారణ్యాన్నిస్తుంది 
చిన్నవైన చినుకులెన్నో కలిసి 
అనంతమైన కడలి అవుతుంది 
పూచిన ఒక్క పువ్వైనా 
తోటంతా గుబాళిస్తుంది
ఎంతదూరపు ప్రయాణమైనా 
ఒక్క అడుగుతోనే మొదలవుతుంది 
అందుకే 
చిన్నవాటిని చిన్నగా చూడకు 
నిర్లక్ష్యం చేయకు!!
**************************************

కామెంట్‌లు