ధనుర్మాస వ్రత విశిష్టత- డా. అరుణ కోదాటి - హైదరాబాద్
శ్రీమన్నారాయుణుడికి ఇష్టమైన మాసం ధనుర్మాసం,
"మాసానామ్   మార్గ శీర్షి్హనం " అన్నాడు కృష్ణభగవానుడు,
పూజలకు, నిర్వహించుకునే పర్వదినాలా వల్ల సకల శుభాలు కలుగు మాసం,
మార్గాలలో, శ్రేష్ఠమైనది, ఉపయోగకరమైనది
అని మార్గ శీర్షిమునకర్థం
శ్రీ కృష్ణున్ని స్మరిస్తూ పాటలు పాడడం, తులసీ దళాలతో శుభప్రదం,
సూర్యుడు ఒక రాశినుండి మరోరాశి లోనికి
మారడాన్ని సంక్రమణం అంటారు.
వృశ్చిక  రాశినుండి భాణుడు ధనూ రాశిలోనికి ప్రవేశించే కాలాన్ని ధను సంక్రమణం అంటారు.
హేమంత ఋతువు కనక మొక్కలు ఆకులు రాలి కొత్త చివుళ్లు తొడిగి ప్రకృతి రమణీయంగా   ఉండడంతో,
సూర్యుడి ఎండలో తాపం  తగ్గి  నును వెచ్చగా  హాయిగా  ఉండడంతో 
నదుల్లోని  నీటి ప్రవాహం  నెమ్మదించి
స్నానాలకు  అనువుగా  ఉండడంతో ,
పూజలకు , స్నానాలకు  అనుకూలంగా  ఉంటుంది ధనుర్మాసం,

దేవాలయాల్లో సుప్రభాత స్థాన   తిరుప్పావై  పాశురాలు మధురాతి మధురంగా  వినిపిస్తుంటాయి,
 శ్రీ కృష్ణుని   భక్తురాలు, గోదాదేవి(ఆండాల్ )
  పెంపుడు తండ్రి విష్ణుచిత్తుడికి  లభించిన స్థలం శ్రీ విల్లి పుత్తూరులో వటపత్ర శాయి
కోవెలకు చెందిన తులసీవనం,
 తిరుప్పావై  గానం  చేస్తూ  తులసీ  మాలలు  కడుతూ,
శ్రీకృష్ణుని స్తుతిస్తూ రాసిన గేయాలను  తమిళంలో  పాశురాలుగా పిలువబడినవి.
యమునా నదిలో తెల్లవారుజామున కన్యలు స్నానమాచారించి  కాత్యాయిని  వ్రతం  చేయడంతో  మాధవుడిని  పెళ్లియాడారని,
గోదాదేవి  కూడా  అవ్రతమాచారించినదని, అముక్త మాల్యద గ్రoధం లో   శ్రీ కృష్ణ దేవరాయలు పేర్కొన్న వైనం,
గోదాదేవి  ప్రతిరోజూ  ఒక పశురాన్ని  గానం  చేస్తూ
వటపత్ర శాయి కొరకు  అల్లిన మాలను  తనమెడలో  ధరించి,
భావిలో తన ప్రతిరూపాన్ని చూసి మురిసేదని, నేటికీ , అబావి  ఉందని  నానుడి.
గోదాదేవి  రచించిన పాశురాలను ప్రభందంగా  భావిస్తారు,
భగవంతుని పాదాల వద్ద శరణాగతి పొందడం,
భగవంతుని ఆశ్రయం  పొందడమే, పరమావది అనిగోదాదేవి వాక్కు,
పన్నెండు మంది ఆల్వారుల్లో ఒక్కరే మహిళ!
చివరికి శ్రీ  హరిలో ఐక్యము చెంది,
ఆమె  నిరంతరం భక్తుల చేత ముఖ్యంగా  ధనుర్మా సాన  పూజాలందుకుంటూనేవుంది. 🙏

 

కామెంట్‌లు