ఉనికి- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 చిత్రకళే వాడి జీవితం
వీధులవెంటే వాడి జీవనం
వాడు కాలసంద్రాన మునిగిన బ్రతుకునావ
వాడు సమాజచౌరస్తాల్లో
చల్లని చెల్లని బ్రతుకు చిల్లర
వాడిచేతిలో ఏఇంటికాఠిన్యమైనా కరగాల్సిందే
వాడిముందుకు ఏసుడైనా, ఎంకటేసుడైనా
అంజనేయుడైనా, అల్లాయైనా దిగిరావాల్సిందే
వాడికి మానవత్వాన్ని మసిచేయడంగాని
మానవదేహాన్ని పొగబండిపాడెపై పెట్టి
దహనంచేయడంగానీ తెలీదు
కేవలం సుద్దముక్కల్ని కరగదీయడం తప్ప
వాడికి చార్మినార్ చరిత్రగానీ,
చంఘిజ్ ఖాన్ చాతుర్యం గానీ తెలీదు
నిర్భాగ్యుల కన్నీటిగాథలు తప్ప
వాడు ఆకలిచావులకేసులో యథార్థసాక్షి
వాడి కడుపు అంట్లగిన్నైనా,
కళ్ళు శోకాశ్రుపుష్ప స్వప్నశకలాలైనా
ఊరూరా తిరగాల్సిందే
ఉనికి కోసం వెదకాల్సిందే!!
*********************************

కామెంట్‌లు