తిరుప్పావై;- కొప్పరపు తాయారు
 2,వ,పాశురం
------------------
 వైయత్తు వాళ్వార్గళ్ నాముమ్  నమ్బావైక్కు
 చ్చెయ్యుమ్  కిరీశైగళ్  పార్కడలుళ్ పై
 యత్తు. యిక. పరమనడిపాడి  నెయ్యుణ్ణమ్
  పాలుణోమ్  నాట్కాలే. నీరాడి  యైయిట్టెళు దోమ్
  మలరిట్టు నా ముడి యోమ్. శయ్యాదన
   శయ్యోమ్  తీక్కురళై. చ్చన్రోదోమ్ ఐయ్యముమ్
    విచ్చైయుమ్ ఆన్ద నైయ్యుమ్ కై కాట్టి ఉయ్యు 
    మారెణ్ణి  యు గన్దేలో  రెమ్బావాయ్ !
 భాగ్యవతులారా ! మనం చేయ బోవు వ్రతానికి
ముఖ్యం గా ఆచరించవలసిన కృత్యముల వినుడు
శ్రీ మన్నారాయణుని పాదారవిందముల కీర్తి స్తాము
అతనితో కలిగిన విశ్లేష సమయాన ఇతరములైన 
ఎట్టి భోజ్య విషయాలను తలచము.
                 పాలు తాగము.కన్నులు కాటుక నుంచము  నేతిని భుజించము. సిగలో పూలను
దాల్చము .అనగా శాస్త్ర విరుద్ధము లైన ఎట్టి పనులను చేయము .
                ఒకరి పై చాడీలు చెప్పము .సత్పాత్ర
దానము చేతము.సన్యాసులకును , బ్రహ్మచారులకును, సత్పాత్ర దానము చేతుము.
ఇంకను ఉజ్జీపించు మార్గములేవైనా యున్న  వాని
నెరిగి  సంతోషముతో  నాచరింతుము.ఇట్లు యీ
ధనుర్మాస కాలమంతయు  కొనసాగింతుము.
ఇది యే మన వ్రతము.
        ******

కామెంట్‌లు