ఇచ్చింది;- - డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 నీటితో
ఎంత మమేకమైందో ఈ భూమి
పచ్చటి పైరుగా మారి
జీవకోటికి ఆహారాన్నందించింది!
గాలితో
ఎంత ఆనందంగా కాలం గడిపిందో ఆ నీలిమేఘం
ఆనందాశ్రు శకలాలు బొట్ట్లు బొట్లుగా వర్షించి
సకల జీవరాశికీ జీవశక్తినిచ్చింది!
సూర్యునితో
ఎంత మమకారంతో అనుగమించిందో మా నీటిచుక్క
సప్తవర్ణాల ఇంద్రధనుస్సుకి ప్రాణంపోసింది!
పూర్ణచంద్రునితో
ఎంత అనురాగంతో సంగమించిందో మా పత్తిచేను
తెల్లారేకల్లా
లక్షలాది బుజ్జి చంద్రులకు జన్మనిచ్చింది!
నన్ను
ఎంతగా ప్రేమించిందో మా ఆవిడ
నా వెచ్చటి కోరికలు తీర్చి
ఆనందమయ జీవితాన్నిచ్చింది!!
*********************************

కామెంట్‌లు