ఏమి మార్పు ;- -- కాజీపేట పురుషోత్తం, విశ్రాంత అటవీ శాఖ అధికారి.
శీర్షిక మారినంత మాత్రాన  ఏమి మార్పు                    
విషయ సారాంశం మారనపుడు ఏమి మార్పు...!  

ప్రజాపాలన చేతులు మారితే  ఏమి మార్పు  
ఉచిత పథకాల పేరు మారితే  ఏమి మార్పు...!

పళ్ళు ఊడటానికి రాయి ఏదయితే ఏమి మార్పు 
ప్రజా క్షేమం పట్టించుకోని ప్రభుత్వాలతో ఏమి మార్పు...!

విద్య, వైద్యం,ఉపాధి అందరికీ అందనపుడు ఏమి మార్పు     ఉచితాలకే  ఉరికే జనాలతో ఏమి మార్పు...!

డబ్బులందే వరకు ఓటేయ్యని జనం ఉన్నప్పుడు  ఏమి మార్పు 
ప్రశ్నించలేని పరిస్థితి ప్రజల్లో ఉన్నప్పుడు ఏమి మార్పు...!

ప్రజాస్వామ్యం కూడా రాచరిక పాలనలా సాగితే  ఏమి మార్పు..
బహుజనులకు రాజ్యాధికారం బహుదూరం అయినప్పుడు ఏమి మార్పు...!

రాకెట్ యుగం లో ప్రజలకు  హేతుబద్ధత లేకుంటే  ఏమి మార్పు
చైతన్యం ,అభ్యుదయ వాదం అగుపడని  ప్రజాస్వామ్యం లో  ఏమి మార్పు...!

శాస్త్రీయ విద్యావిధానం అమలు కానప్పుడు ఏమి మార్పు
మనిషి చంద్రమండలం చేరినా  క్షుద్ర పూజలు చేస్తుంటే ఏమి మార్పు...!


కామెంట్‌లు