పురాణ బేతాళ కథలు. కపిలమహర్షి . ;- డాక్టర్ . బెల్లంకొండ నాగేశ్వర రావు చెన్నై

 పట్టువదలని విక్రమార్కుడు మరలా స్మశానం చేరుకుని చెట్టుపైన ఉన్న బేతాళునిబంధించి తనభుజంపైనచేర్చుకుని మౌనంగా నడవసాగాడు.
శవాన్ని ఆవహించిఉన్నబేతాళుడు "భళా విక్రమార్క నీపట్టుదల మెచ్చదగినది. నాకు కపిల మహర్షి  గురించి తెలుసుకోవాలనిఉన్నది సకలకళావల్లభుడవైననీవు నాకు తెలియజేయి
తెలిసిచెప్పకపోయావో మరణిస్తావు "అన్నాడు.
" బేతాళా కపిల మహర్షి వేద కాలపు హిందూ మహాముని. ఇతని గురించి శ్రీమద్భాగవతంలో సాంఖ్య శాస్త్రంలోని ప్రాథమిక సూత్రాలను రచయితగా పేర్కొన్నది. ఇవి సాంఖ్య గ్రంథముగా లభ్యమవుతునాయి. దీనిని సాంఖ్య కారిక అని అఓటారు. దీనిలో 7 విభాగాలు ఉన్నాయి. దీనికి ఉన్న అనుబంధాలు, వ్యాఖ్యానాలతో కలిపి ఇది ఆరు అధ్యాయాలుగా విస్తరించింది. కాలంతో పాటు దీనికి అనేక వ్యాఖ్యానాలు వ్రాయటం జరిగింది. దీనికి ఉదాహరణ అనిసరుధ్ధుడు రచించిన కపిల సాంఖ్య ప్రవచన సూత్ర వృత్తి .
మహాభారతంలో పేర్కొన్నట్లుగా, ఇతడు ఏడుగురు బ్రహ్మ మానస పుత్రులలో ఒకరు. ఇతరులు అనిరుద్ధుడు, సనత్కుమారులు. విష్ణు పురాణంలో ఇతన్ని మహావిష్ణువు యొక్క అవతారంగా పేర్కొనబడినది. ఇతడు భక్తి యోగంలో ముక్తిని సాధించే ప్రక్రియను బోధించే గురువుగా ప్రసిద్ధులు.
కపిలముని జీవితం గురించిన చాలా వివరాలు శ్రీ మధ్భాగవతంలోని 3వ స్కంధము 33వ అధ్యాయము అయిన కపిలుని రచనలలో లభ్యమౌతున్నాయి, ఇందులో ఉన్న వివరాల ప్రకారం - అతని తల్లి తండ్రుల పేర్లు కర్దమ ముని, దేవహూతి. తన తండ్రి ఇల్లు వదలి వెళ్ళిన తరువాత కపిలముని తన తల్లి అయిన దేవ హూతికి యొగ శాస్త్రాన్ని అభ్యసించమని విష్ణువుని ప్రార్థించమని, వాటి వలన దేవుని యెడల నిజమైన భక్తి మోక్షము కలుగుతాయని సలహా ఇచ్చాడు. 
సూర్యవంశపు రాజైన సగరునకు వర ప్రభావం వలన మొదటి భార్యకు మహాతేజోవంతుడైన అసమంజసుడు, రెండవ భార్యకు చిన్న చిన్న తిత్తులతో కూడిన పిండం ప్ర్రసవింపబడింది, ఆ పిండానికి వున్న తిత్తులను దాదులు 60 వేల నేతికుండలలో భద్రపరచగా( పొదగడం ) 60 వేల మంది కుమారులు కలిగిరి వీరు ప్రత్యేక నామాలతో కాక సగరులుగా ప్రసిద్ధి చెందారు. కాని పెద్దవాడైన అసమంజశుడు తనతోపాటు ఆడుకోవదడానికి వచ్చే పిల్లలను సరయు నదిలో తోసివేయడం లేక వారి కొనప్రాణం వరకు నీటిలో ముంచి వారు తమ ప్రాణాలను కోసం పడే నరకయాతనను చూసి సంతోషపడే వాడు. ఇది తెలిసిన ప్రజానీకం రాచబిడ్డడు అనే ఉద్దేశ్యంతో రాజుగారికి చెప్పుటకు భయపడుతుండే వారు. కానీ ఎంత వయసు వచ్చినా అంశుమంతుడి ప్రవర్తనలో ఎలాంటిమ మార్పు రాకపోయేసరికి భరించలేని ప్రజలు అంసుమంతుడి ఆగడాల గురించి మహారాజుకు తెలియజేయడంతో రాజు తన కొడుకుకి రాజ్య బహిష్కారం శిక్ష విధించాడు. ఆ తరువాత మహారాజు తన రాజ్యా విస్తరణ కొరకు తన 60 వేల మంది పుత్రులే తనకు ఒక సేనలా అగుపించగా తాను మహర్షుల అనుమతి మేరకు అశ్వమేధ యాగాన్ని చేయ సంకల్పించి యాగాశ్వమును విడిచిపెట్టెను. యాగాశ్వ రక్షణకు తన కుమారులను పంపి తాను యాగ కంకణధారి అయి వుండెను. కాని మహారాజు ఈ అశ్వమేధ యాగాల పుణ్యఫలంతో తన ఇంద్రపదవికి ఎక్కడ పోటీ వస్తాడేమొనని భయపడిన ఇంద్రుడు యాగం భగ్నం చేయడానికి యాగాశ్వమును పాతాళంలో లోని కపిల మహర్షి ఆశ్రంమంలో దాచాడు. యాగపశువు కనిపించక పోవడంతో ఆ అశ్వానికి రక్షణగా వెళ్ళిన సగరుని 60 వేల మంది పుత్రులు భూ మండలమంతా గాలించిననూ యగాశ్వపు ఆచూకి దొరకకపోవడంతో ఇంటిముఖం పట్టగా, తండ్రి అయిన సగర చక్రవర్తి ఆదేశాల మేరకు వారు పాతాళంలో వెతుకుట కొరకు భూమి పై అనేక గుంతలను తీసి పాతాళ ప్రవేశం చేశారు కాని వీరి అత్యుత్సాహం భూదేవికి కడు ఖేదం కలిగించింది. కానీ తదుపరి కాలంలో ఈ గుంతలలో జలములు చేరి సగరుల పేరిట సాగరమైంది. పాతాళంలో వెతుకుతున్న సగరులకు కపిల మహర్షి ఆశ్రమంలో యాగాశ్వం కనిపించడంతో ఇతను ఏవరో మాయోపాయంతో తమ యాగాశ్వమును తస్కరించి వుంటాడని భావించిన వారై క్రుద్దులై కపిల మహర్షి పైకి ఉరికిరి. ఈ అలజడికి ధ్యాన సమాధి నుండి మేల్కోన్న మహర్షి తనపైకి వస్తున్న సగరుల వంక చూసి ఒక్క హుంకారం చేసెను. అంతట మహర్షి కోపాగ్నికి 60 వేలమంది సగరులు భస్మమై 60 వేల బూడిదకుప్పలై పోయారు. యాగాశ్వము కొరకు వెళ్ళిన తన పితామహులు ఎంతకీ తిగిగ రాకపోవడంతో యాగ పరిసమాప్తి కాక మధనపడుతున్న సగరునితో అసమంజసుని మనవడు ఆంశుమంతుని కొడుకు సగర కుల్భవుడు అయిన భగీరధుడు యాగాశ్వమును వెతుకుతూ పాతాళం చేరి వారికి ఉత్తమగతులు లభించాలంటే దివిజ గంగను పాతాళానికి తేవలసి ఉంది. సగరుడు, అతని కొడుకు అసమంజసుడూ తపసు చేసినా ప్రయోజనం లేకపోయింది.
భగీరధుడు తన తాతలకు ఉత్తమ గతులు ప్రాప్తించాలని గంగకోసం తపస్సు చేశాడు. గంగ ప్రత్యక్షమై "నేను భూమి మీదికి దిగిరావడానికి సిద్ధంగా ఉన్నాను. కాని నా దూకుడు భరించగల నాధుడెవ్వరు?" అని అడిగింది. భగీరధుడు శివుని కోసం తపసు చేశాడు. అనుగ్రహించిన శివుడు గంగను భువికి రాగానే తన తలపై మోపి, జటాజూటంలో బంధించాడు. భగీరధుని ప్రార్ధనతో ఒక పాయను నేలపైకి వదలాడు. భగీరధుని వెంట గంగ పరుగులు తీస్తూ సాగింది. ఆపై సాగరంలో ప్రవేశించి, పాతాళానికి చేరి, సగరుని పుత్రులకు ఉత్తమ గతులను కలుగజేసింది " అన్నాడు విక్రమార్కుడు.
అతనికి మౌనభగంకావడంతో శవంతోససహ మాయమైన బేతాళుడు మరలా చెట్టుపైకిచేరాడు.
పట్టువదలని విక్రమార్కుడు బేతాళునికై మరలా వెనుతిరిగాడు.

కామెంట్‌లు