అక్షరాలు- - డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 నా అక్షరాలు
నరనరానా పారుతూనే ఉంటాయ్!
రక్తం ఉడికిస్తూనే ఉంటాయ్!
నా అక్షరాలు
ద్రవీభవించి సిరాచుక్కై 
లక్షల మెదళ్ళను కదిలిస్తూనే ఉంటాయ్!
నా అక్షరాలు
విజ్ఞాన గవాక్షాలై
విశ్వపు వినువీధి రహస్యాల
అంతు చూస్తూనే ఉంటాయ్!
నా అక్షరాలు
నిజాలను గాలికొదిలి,
ఇజాలను పట్టుకు వేళ్ళాడే
గబ్బిలాయిలను
తరిమి కొడుతూనే ఉంటాయ్!
నా ఆక్షరాలకు నిరీక్షణే ఉండదు
వాడి వేడి అక్షర కిరణాలవడం తప్ప!
నా అక్షరాలకు పరీక్షలే లేవు
అక్షరాస్త్రాలయి
అజ్ఞానాన్ని తరమడం తప్ప!!
*********************************

కామెంట్‌లు