* కోరాడ అష్టాక్షరి గీతాలు *

 జనన మరణములు
  రుణాను బంధా లేనురా
  అవి తీరే దే నాటికీ....! 
   తెలుసు కోర కోరాడ...!! 
     *******
కర్మె  జన్మ కు మూలము
  కర్మలు నిరో ధించరా... 
  యోగివైతేనె సా ధ్య ము
 తెలుసు కోర కోరాడ...!! 
    *******
పంచ భూత ములే మూల0
ప్రపంచ మనిన ఇదే...., 
 పాంచబౌతి కుల0 మన0
  తెలుసు కోర కోరాడ..! 
*********
భక్తి యే ముక్తి కి మార్గ0
 నామ జపమే చాలురా
   మోక్షమునే పొందెదవు
  తెలుసు కోర కోరాడ..! 
  *******
శ్రీ మ న్నా రాయణ నామ0
 నిరతము జపించరా.... 
అదియే ముక్తికి మార్గ0
 తెలుసు కోర కోరాడ...! 
   *******
ప్రేమ, సేవను మించేది
 వేరే దీ ఇలలో లేదు... 
 సత్య సాయినే చూడరా
  తెలుసు కోర కోరాడ...! 
  *******
భోగము లను వీడరా
త్యాగ బుద్దితో ఉండరా
 యోగి గానే జీవించాలి
  తెలుసు కోర కోరాడ...! 
   ********
 తామరాకుపై నీరులా
 సమాజం లో నీవుండరా
  సాక్షీ భూతుడ గుండర
  తెలుసు కోర కోరాడ....!! 
   ********
కామెంట్‌లు