తిరుప్పావై ;- కొప్పరపు తాయారు
   🌻19వ,పాశురము🌻
కుత్తు విళక్కెరియ క్కోట్టుక్కాల్ కట్టిల్   మేల్ 
మెత్తైన పణ్యశయనత్తిన్  మేలేరి కొత్తిలర్ 
పూజళల్  నప్పిన్నై కొంగ్రెయేల్ తక్కిన మలర్
మార్పా! వాయ్ తిరవాయ్ మెత్తడజ్ఞ్కణ్ణినాయ్ 
నీ యున్మణాలనై ఎత్తనై పోదుమ్ తుయిలెళ
ఒట్టాయ్ కాణ్  యెత్తనై యేలుమ్ పిరివాట్ల 
గిల్లాయాల్  తత్తువ మన్రుత్తగవేలో
  రెమ్బావాయ్ 
 గుత్తి దీపపు కాంతులు నలుదెశల వెలుగులు ప్రసరించుచుండగా ఏనుగు దంత ములచే చేయబడిన కోళ్లు గల మంచము మీద అందము, చలువ, మార్దవము ,పరిమళము, తెలుపులనే  ఐదు గుణములు కలిగిన హంస తూలికా తల్పము పై పవ్వళించి యుండు గుత్తులు గుత్తులుగా వికసించిన పువ్వులచే అలంకరించబడిన శిరోజములు కలిగిన నీలాదేవి యొక్క స్తనములను తనవిశాల వక్షస్థలం పై వైచుకొని పవ్వళించి యున్న ఓ స్వామీ!
నోరు తెరిచి ఒక్క మాటైనను మాటాడకూడదా ? లేక
కాటుక చే అలంకరింపబడిన విశాలమైన నేత్రములు
కల ఓ నీలాదేవి! జగత్స్వామియైన శ్రీ కృష్ణుని స్వల్పకామైనను పడక విడచి బయటికు వచ్చుటకు
అనమతింపకున్నావు.క్షణమైనను శ్రీ కృష్ణుని విశ్లే‌షమును సహింపజాలవే ?ఇదినీస్వరూపమునకు
నీ స్వభావము నకును తగదు.నీవలె మేము కూడా
అతనికి అనన్యార్హ శేష భూతులమే కదా ! కానీ
కరుణించి కొంచెమవకాశ మీయుము తల్లీ !అట్టి అవకాశము నీ విచ్ఛితివేని మేము చేసేయీ అద్వితీయమైనా ధనుర్మాస వ్రతము గా సాంగో పాంగము సమాప్తి చెందును.ఇందేమాత్రము సంశయం లేదు అనిఆండాళమ్మగారు నీనా, కృష్ణులను వేడు కొంటున్నారు.
            🪷****🪷****

కామెంట్‌లు