* కోరాడ అష్టాక్షరీ గీతాలు *

 గోవర్ధన గిరి నెత్తి
 కాళియ సిరము నెక్కి
 పూతనను జంపి నావు 
జయ కృష్ణా..! కృష్ణ ప్రియ
    ******
స్నేహము మరచి పోక
కుచేలుని సన్మా నించి 
 ఉదారతను చాటావు
 జయ కృష్ణా! కృష్ణ ప్రియ.!! 
    *******
వేణు గాన లోలుడవు
కరమున మురళితో
జగముల నూపినావు
 జయకృష్ణా..! కృష్ణప్రియ..!! 
      ******
నుదుటన తిలకము
నెత్తిన నెమలీకతో
నీలి మేఘ వర్ణుడవు
 జయ కృష్ణా..! కృష్ణ ప్రియ..!!
******
దానవ కుల వైరివి
పాండవ పక్ష పాతివి
 పార్ధ సారధి వైతివి
 జయ కృష్ణా..! కృష్ణ ప్రియ..!! 
    *******
కామెంట్‌లు