కన్యాకుమారి! అచ్యుతుని రాజ్యశ్రీ

 కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా మనదేశం ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ప్రదేశాలతో అలరారుతోంది.దక్షిణకొసన ఉన్న కన్యాకుమారి పుణ్య క్షేత్రం.స్వామివివేకానంద విగ్రహం కూడా ఉంది.మూడు సముద్రాల సంగమం ఆలయం లైట్ హౌస్ తో ఆకర్షణీయంగా ఉంటుంది.కానీశివ పార్వతుల కథతో ముడిపడిన ధార్మిక ప్రాంతం.ఆడపిల్ల పేరు లా ఉన్న ఈప్రాంతంకి ఆపేరు రావటం వెనుక ఓకథ ఉంది.బాణాసురుడనే రాక్షసుడు శివుని గూర్చి గొప్ప తపస్సు చేసి ఎవరూ ఎప్పుడూ తనని చంపకూడదు అని అడిగాడు.బోళాశంకరుడు సరే అన్నాడు.ఇంకేముంది? వాడి ఆగడాలకు అంతే లేకుండా పోయింది.కానీ వాడిని చంపేశక్తి కేవలం ఓపెళ్ళికాని కన్యకు మాత్రమే ఉంటుంది.అందుకే ఆదిశక్తి లోని ఒక అంశ ఒకరాజు ఇంట ఆడపిల్ల గా పుట్టింది.8మంది కొడుకులు తర్వాత పుట్టిన ఈపాప అల్లారుముద్దుగా పెరిగి శివుని మాత్రమే పెళ్లి చేసుకుంటా అని పట్టుపట్టింది.ఆమెపేరు కన్య.శివునిగూర్చి ఘోరతపస్సు చేసి మెప్పించింది.శివుడు అంగీకరించాడు.పెళ్ళి ముహూర్తం తెల్లారిన తర్వాత.శివుడు రాత్రి తన బృందంతో పెళ్లి కి బైలుదేరాడు.కానీ కన్య తో కానీ బాణాసురుడు చావడు.ఆందుకే నారదుడు దేవతలతో కల్సి యుక్తి పన్నాడు.అర్ధరాత్రి సమయంలోనే అంతా కోడికూత కూశారు.ఇక శివుడు ఆలోచన లో పడ్డాడు " ఇక్కడే తెల్లారిపోయింది. పెళ్లి ముహూర్తం దాటిపోయింది." అని తన వారితో వెనుతిరిగాడు.ఈలోపల కన్యపెళ్ళి శివుని తో జరగబోతోంది అని తెల్సుకున్న బాణాసురుడు యుద్ధం చేస్తాడు.కన్య షరతు పెట్టింది " నేను ఓడిపోతే నీభార్యను ఔతాను." యుద్ధం లో బాణాసురుడు చచ్చాడు.అంతే శివస్మరణతో ఆమె అవివాహిత గా ఉండిపోయింది.అందుకే కన్యాకుమారి అని పేరు వచ్చింది.అంతరార్ధం మనకి తెలీదు.కానీ స్త్రీ ఆదిశక్తి అని యుద్ధం లో నేర్పరి అని మనపురాణాల్లో ఆడవారికి ప్రాముఖ్యత నిచ్చారు🌷
కామెంట్‌లు