సుప్రభాత కవిత ;- బృంద
మనసున మోసే
అనవసర ఆలోచనలకు
మనమే కళ్ళెం వేయాలి
మళ్ళింపు అవసరం

మంచికీ చెడుకీ
మధ్యన పల్చని పొర
ఏది ఎటైనా కావచ్చు 
విచక్షణ అవసరం

మనవి కాని  వాటిపై
మమకారం  ఎక్కువ
అందుకోవాలని ఆశ కూడదు
సమతౌల్యం  అవసరం

భ్రమలన్నీ కలలుగా
మార్చుకోకూడదు
సాకారమవలేని కలలు కూడదు
ఆలోచన అవసరం

ప్రతి ప్రశ్నకూ సమాధానం
కాలం చెబుతుంది
ఏది దేనికో తెలుసుకోవాలి
వివేకం అవసరం

అడుగులు తడబడవచ్చు
దారి తప్పకూడదు
అనుకున్న గమ్యం చేరాలి
స్థిరత్వం  అవసరం

అవసరమైన ఆసరా ఇస్తూ
తూరుపు తలుపు తీస్తుంది
వేచి వుండి వెలుగును స్వాగతించాలి
ఆచరణ అవసరం

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు